చైతు కోసం తరుణ్ భాస్కర్ స్టోరీ!

Naga Chaitanya

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమాను పూర్తి చేస్తున్నారు చైతు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీలకపాత్ర లో కనిపించనున్నారు ఈ యంగ్ హీరో. ఈ సినిమా షూటింగ్ కోసం లడఖ్ కు వెళ్లారు. ఇదిలా ఉండగా.. చైతు కోసం ఇప్పుడు మరో స్టోరీ సిద్ధమైందని సమాచారం.

తెలుగులో ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. చైతుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి వెంకీతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కథ మొత్తం మార్చి రాస్తున్నారట. ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి. అందుకే ముందుగా చైతూతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను కూడా సురేష్ బాబు నిర్మిస్తారని తెలుస్తోంది.

నిజానికి ‘పెళ్లిచూపులు’ సినిమా విడుదలైన తరువాత తరుణ్ భాస్కర్ కి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేశారు సురేష్ బాబు. కానీ తరుణ్ భాస్కర్ చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ సురేష్ బాబుకి నచ్చడంతో చైతుని హీరోగా పెట్టి సినిమా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం లడఖ్ లో ఉన్న చైతు తిరిగొచ్చిన వెంటనే అతడికి కూడా కథ వినిపించనున్నారు. అన్నీ ఒకే అయితే వచ్చే ఏడాదిలో ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది!

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)