Movie News

అనవసరంగా సిద్ధును లాగారే..


సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్‌గా ట్వీట్లు వస్తూ.. విమర్శలు చేసే వాళ్లకు చురుక్కుమనిపించేలా జవాబులు ఇస్తుంటాడు తమిళ నటుడు సిద్దార్థ్. చాలామంది ఫిలిం సెలబ్రెటీలు ప్రభుత్వ అధినేతల గురించి చిన్న కామెంట్ చేయడానికి కూడా చాలా భయపడిపోతుంటారు కానీ.. సిద్ధు మాత్రం ప్రధాన మంత్రిని కూడా ఘాటుగా విమర్శించడానికి వెనుకాడడు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే నెటిజన్లను వెతికి వెతికి వాయించేస్తుంటాడతను. అందులోనూ తనకు సంబంధం లేని విషయాల్లో లాగే వాళ్లను సిద్ధు అంత తేలిగ్గా వదలడు.

ఈ మధ్యే ఆంధ్రా భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డికి సిద్ధు ఇచ్చిన పంచ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఒక నెటిజన్ సిద్ధు ఆగ్రహాన్ని చవిచూశాడు. సంబంధం లేకుండా ఒక వివాదంలోకి సిద్ధు పేరును లాగడమే ఇందుక్కారణం. దీని వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘నారప్ప’ ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలోంచి ‘ఓ నారప్ప’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్లో వెంకీతో పాటు అమ్ము అభిరామి ఉంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వెంకీకి జోడీగా నటించిందా అమ్మాయి. ఐతే వెంకీతో పోలిస్తే ఆమెకు మూడో వంతు వయసుంటుందేమో. దీని గురించి ఒక నెటిజన్ ఒక అభ్యంతకర పోస్టు పెట్టింది. మనవరాలి వయసున్న అమ్మాయితో వెంకీ రొమాన్స్ ఏంటి అంటూ వెంకీని టార్గెట్ చేసింది. ఐతే ఇలా ప్రశ్నించిన అమ్మాయి గతంలో సిద్ధార్థ్‌ను ఫ్లర్ట్ చేస్తున్నట్లుగా ట్వీట్లు వేసింది. దాన్ని కొందరు పట్టుకున్నారు.

40 ప్లస్ వయసున్న, పెళ్లయిన సిద్ధును అమ్మాయిలు ఇష్టపడి, వలపు బాణాలు విసరగా లేనిది.. వెంకీ ఓ చిన్న అమ్మాయితో సినిమా కోసం జోడీ కడితే తప్పేంటి అని ప్రశ్నించాడు. ఐతే సిద్ధును ట్యాగ్ చేసి మరీ అతను ఈ ట్వీట్ వేయడంతో ఈ హీరో లైన్లోకి వచ్చాడు. ‘‘ఈ హీరో వయసు టాపిక్‌లో నీకు ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? ట్యాగ్ కూడా చేశావ్. సూపర్ రా దరిద్రం. ఎక్కడి నుంచి వస్తార్రా మెంటలోళ్లు?’’ అంటూ తెలుగులో అతను ట్వీట్ వేయడమే కాక.. నా వయసు నాకు తెలుసు, తెలుగు, దారుణం అనే పదాల్ని హ్యాష్ ట్యాగ్స్‌గా కూడా పెట్టడం విశేషం.

This post was last modified on July 17, 2021 8:27 am

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

1 hour ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

4 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

6 hours ago