ఒక సినిమా ఫస్ట్ లుక్ కోసం సోషల్ మీడియాలో ఏడాదికి పైగా ఒక హీరో అభిమానులు ఉద్యమం చేయడం అనూహ్యమైన విషయం. అది తమిళ టాప్ స్టార్ అజిత్ కుమార్ ‘వాలిమై’ విషయంలో మాత్రమే జరిగింది. ఈ సినిమా పట్టాలెక్కి ఏడాది దాటింది. కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఐతే సినిమా ఆలస్యమైతే అయింది కానీ.. కనీసం ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయమంటూ అజిత్ అభిమానులు చిత్ర బృందంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ‘వాలిమై అప్ డేట్ ఇవ్వాలి’ అంటూ ప్లకార్డులను ఎక్కడెక్కడో ప్రదర్శించారు.
మేలో ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలనుకున్నారు కానీ.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ ఈ ఆదివారం సాయంత్రం రిలీజైంది. పెద్దగా హడావుడి లేకుండా.. సడన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ఒకేసారి రెండు మూడు లుక్స్ రిలీజ్ చేశారు. ఒక మోషన్ పోస్టర్ సైతం వదిలారు.
మామూలుగా చూస్తే ‘వాలిమై’ ఫస్ట్ లుక్ బాగానే అనిపిస్తోంది. చాలా స్లైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఐతే ‘వాలిమై’ ఫస్ట్ లుక్ మీద ఇంత చర్చ జరిగాక భారీ అంచనాలతో చూస్తే మాత్రం ఫస్ట్ లుక్ యావరేజ్ అనిపిస్తోంది. ఇంకా బాగా ఉండాల్సింది అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ చూస్తే ఇది స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. ఇక అన్నింటికీ మించి ఫస్ట్ లుక్ పరంగా అజిత్ అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న విషయం ఏంటంటే.. ఇందులో అజిత్ మోటార్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. నిజ జీవితంలోనూ అజిత్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. అతడి వ్యక్తిగత అభిరుచి నేపథ్యంలోనే దర్శకుడు హెచ్.వినోద్ కథ అల్లుకున్నట్లున్నాడు.
ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. కార్తితో వినోద్ తీసిన ‘ఖాకి’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అజిత్‌తో అతను చేసిన ‘పింక్’ రీమేక్ ‘నీర్కోండ పార్వై’ కూడా బాగానే ఆడింది. దీంతో ‘వాలిమై’కు సంబంధించి వినోద్‌పై భారీ అంచనాలున్నాయి. ఇందులో తెలుగు నటుడు కార్తికేయ విలన్ రోల్ చేస్తుండటం విశేషం.
This post was last modified on July 12, 2021 7:17 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…