సినిమా వాళ్లను బయటి వాళ్లు చూసే కోణమే వేరుగా ఉంటుంది. అందుకే తమను ఈ రంగంలోని వాళ్లే బాగా అర్థం చేసుకుంటారని సినీ జనాలు అనుకుంటారు. అందుకే సినిమా వాళ్లు ఒకరితో ఒకరు ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం మామూలే. ఐతే ఇలా ఒక్కటైన జంటలన్నీ కలిసి సాగుతాయని గ్యారెంటీ లేదు. విభేదాలతో కొంత కాలానికే విడిపోయిన జంటలు బోలెడు. ముఖ్యంగా బాలీవుడ్లో విడాకులు తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు.
అర్బాజ్ ఖాన్-మలైకా అరోరాలతో మొదలుపెడితే.. తాజాగా ఆమిర్ ఖాన్-కిరణ్ రావుల వరకు వివాహ బంధానికి మధ్యలో తెరదించిన జోడీలు చాలానే కనిపిస్తాయి. సరిగ్గా ఆమిర్-కిరణ్ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడం తన అదృష్టమని ఆమె వ్యాఖ్యానించింది.
దేవుడి దయ వల్ల తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదని.. అందుకు తాను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని సోనమ్ పేర్కొందవి. బాలీవుడ్లో పని చేసే వాళ్ల ప్రపంచం చాలా సంకుచితంగా ఉంటుందని.. అందుకే ఇక్కడి వ్యక్తులను పెళ్లి చేసుకోకూడదని తాను భావించానని ఆమె చెప్పింది. తండ్రి, సోదరుడు, ఇంకా కపూర్ ఫ్యామిలీలో ఎంతోమంది సినీ రంగంలోనే ఉండగా.. ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదన్నట్లుగా సోనమ్ వ్యాఖ్యానించడం సంచలనమే.
ఆమె వ్యాపారవేత్త అయిన ఆనంద్ ఆహుజాను పెళ్లాడటం తెలిసిందే. ఆనంద్ తన లాగే ఆలోచిస్తాడని, అతనో ఫెమినిస్ట్ కూడా అని.. అలాంటి వ్యక్తిని పెళ్లాడటం తన అదృష్టమని సోనమ్ పేర్కొంది. ఆనంద్ లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ కావడంతో పెళ్లయ్యాక కొంత కాలం వరకు తమకు ముంబయి-లండన్ ప్రయాణాలకే సమయం సరిపోయేదని.. ఐతే గత ఏడాది నుంచి కరోనా కారణంగా తాను షూటింగ్‌లకు దూరం కావడంతో లండన్లో ఆనంద్‌తో విలువైన సమయం గడపడానికి అవకాశం దొరికిందని.. ఈ రోజులు చాలా బాగున్నాయని సోనమ్ చెప్పింది.
This post was last modified on July 6, 2021 7:36 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…