బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను మిస్టర్ పెర్ఫెక్ట్ అని సంబోధిస్తుంటారు. అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్ గా ఉండే ఆయన ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా తన రెండో భార్య కిరణ్ రావ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు అమీర్ ఖాన్. అప్పటినుండి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఆయన అనౌన్స్ చేసి మూడు రోజులవుతున్నప్పటికీ… ఇంకా ఈ అంశం ట్రెండింగ్ లోనే ఉంది. దానికి మరో కారణం కూడా ఉంది. యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా ఖాన్ తో అమీర్ ఖాన్ ప్రేమలో పడ్డారని ఆ కారణంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం. అయినప్పటికీ ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి జనాలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పైగా మిస్టర్ పెర్ఫెక్ట్ ఇమేజ్ ఉన్న స్టార్ ఇలా చేయొచ్చా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. వీటిల్లో చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా ఫాతిమాకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఈ ట్రోలింగ్ ఉంటుందని అమీర్ ఖాన్ ముందే ఊహించినట్లు ఉన్నారు.
అందుకే ఆయన ప్లానింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలోనే ట్విట్టర్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ట్రోలింగ్ ను భరించాల్సిన అవసరం లేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆయన నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ దశలో ఉంది. ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలకపాత్ర పోషిస్తున్నారు.
This post was last modified on July 7, 2021 7:27 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…