బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఇటీవల తాప్సీ తీరుని తప్పుబడుతూ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ ల విడాకులపై స్పందించారు. అమీర్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. కిరణ్ రావ్ హిందూ కుటుంబంలో జన్మించారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతం విషయంలో సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కంగనా.
పంజాబ్ లో చాలా వరకు కుటుంబంలో ఒకరిని సిక్కుగా, మరొకరిని హిందువుగా పెంచడానికి ఇష్టపడతారని చెప్పిన కంగనా.. అందరూ అలా ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ముస్లిం మతంలో అసలు ఆ పద్ధతి కనిపించదని మండిపడ్డారు. హిందువు అయిన కిరణ్ రావ్.. అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత ముస్లింగా ఎందుకు మారిపోయారంటూ కంగనా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రానా ఆమె మతం మార్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు.
తన కొడుకుని కిరణ్ రావ్ ఎందుకు ఒక హిందువుగా పెంచలేకపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. మతాంతర వివాహం చేసుకుంటే మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని.. పిల్లలను ఇతర మతాల్లో పెంచాల్సిన అవసరం అసలు లేదంటూ చెప్పుకొచ్చారు కంగనా. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్- కిరణ్ రావ్ లు తమ కొడుకు విషయంలో ఇద్దరం బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఇక వీరి కొడుకు పూర్తిగా ముస్లిం పద్దతిలోనే పెరుగుతాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
This post was last modified on July 6, 2021 10:19 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…