ఉగ్రవాదులతో కాజల్ స్నేహం..!

హీరోలతో పోలిస్తే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే ఉన్నంత కాలం ఎక్కువ సినిమాలు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. ఈ క్రమంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతాయో ఆ సమయంలో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడతారు. రిస్క్ లేదని తెలిసినప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తారు. ఈ క్రమంలో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు కాజల్ కూడా ఇదే రూటులో వెళ్తుంది.

పెళ్లి తరువాత ఎలాంటి పాత్రల్లో కనిపించినా.. పెద్దగా సమస్యలు రావు. అందుకే కాజల్ ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు ఒప్పుకుంది కాజల్ ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోన్న ఈ బ్యూటీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకుంది. ఇందులో నాగ్ తో జోడీ కట్టనుంది.

అయితే ఈ సినిమా కాజల్ పాత్ర రెగ్యులర్ హీరోయిన్ మాదిరి ఉండదట. కథ ప్రకారం ఆమె రా ఏజెంట్ గా కనిపించనుంది. అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా ఉగ్రవాదులతో కలిసి సన్నిహితంగా మెలుగుతూ.. అక్కడి సమాచారణని ఇండియన్ ఆర్మీకి చేరవేసే పాత్రలో కాజల్ కనిపిస్తుందట. కాజల్ కి ఇదొక ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఇందులో నాగ్ తో రొమాన్స్, పాటలు లాంటివేవీ ఉండవట. సినిమా మొత్తం కాజల్ పాత్ర సీరియస్ గానే సాగుతుందట. మరి ఈ పాత్రకు కాజల్ ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి!