రామ్ చరణ్‌తో తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ చేయబోయే సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో చిత్ర బృందం ఒక అంచనాకు వచ్చేసినట్లు సమాచారం. జులైలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. ఆదివారం జరిగిన కీలక పరిణామంతో ఈ విషయం ఖరారైనట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే రామ్ చరణ్, దిల్ రాజు కలిసి శంకర్‌ను కలిసి సమావేశం అయ్యారట. స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ వినడంతో పాటు షూటింగ్ విషయంలోనూ ముగ్గురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇండియన్-2 వివాదం నుంచి శంకర్ బయటపడ్డ నేపథ్యంలో వచ్చే నెల నుంచే చరణ్ సినిమాను మొదలుపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు ప్రొడక్షన్ టీం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల్లోనే ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు, షూటింగ్ అప్‌డేట్‌తో ఒక ప్రకటన ఇవ్వబోతున్నారని సమాచారం. టైటిల్ ప్రకటించి షూటింగ్‌కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ విదేశీ భామకు కూడా ఇందులో కీలక పాత్ర ఉందని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత బాధ్యతలు తీసుకుంటున్నాడు.
శంకర్ తరహాలోనే సామాజిక అంశాలతో ముడిపడ్డ కమర్షియల్ ఎంటర్టైటనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. శంకర్‌కు ఎలాగూ దేశవ్యాప్తంగా పేరుంది. ఆర్ఆర్ఆర్‌తో చరణ్ సైతం పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం. కాబట్టి ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి హైప్ పీక్స్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 5, 2021 10:02 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…