నటి ఆరోపణలపై రమ్యకృష్ణ రియాక్షన్!

ఈ మధ్యకాలంలో నటి వనితా విజయ్ కుమార్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తన తల్లితండ్రులతో గొడవలు, మూడు పెళ్లిళ్లు వంటి విషయాలతో వనితా తమిళనాట సంచలనంగా మారింది. కొన్ని వ్యక్తిగత కారణాలతో చాలా కాలం నటనకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా స్టార్ విజయ్ టీవీతో జర్నీ చేస్తోంది. ‘బిగ్ బాస్ జోడిగళ్’ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె సడెన్ గా ఆ షో నుండి తప్పుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన కూడా చేసింది.

ఈ షోలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నానంటూ ట్వీట్లు వేసిన ఆమె.. ఓ సీనియర్ నటి కారణంగానే తాను షోని వదిలేయాల్సి వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. ‘బిగ్ బాస్ జోడిగళ్’కు హోస్ట్ గా ప్రముఖ నటి రమ్యకృష్ణ వ్యవహరిస్తోంది. షోలో ఉన్న సీనియర్ నటి కూడా ఆమెనే. దీంతో అందరూ వనితా ఆమెని ఉద్దేశించే కామెంట్స్ చేసి ఉంటుందని అనుకున్నారు.

ఇదే విషయాన్ని ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి ఆమె చాలా డీసెంట్ గా స్పందించింది. ‘షోలో ఏం జరిగిందో మీరు ఆమెని అడిగి ఉంటే బాగుండేదని’ అన్నారు. తనకు సంబంధించినంత వరకు ఇదేమీ పెద్ద విషయం కాదని.. నో కామెంట్స్ అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వనితా విజయ్ కుమార్ ఈ షోలో పాల్గొన్న చివరి ఎపిసోడ్ లో ఆమె పెర్ఫార్మన్స్ కు రమ్యకృష్ణ పదికి ఒక్క మార్క్ ఇచ్చారు. పెర్ఫార్మన్స్ బాలేని కారణంగానే వనితాను షో నుండి తప్పించి ఉంటారని అనుకుంటున్నారు.