Movie News

మెహ్రీన్ విడాకులకు అదే కార‌ణ‌మా?

శ‌నివారం సినిమా వాళ్ల‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో రెండు వార్త‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఒక‌టి ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు విడాకులు తీసుకోవ‌డం. ఇంకోటి మెహ్రీన్ పిర్జాదా త‌న‌ నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకోవ‌డం. ఆమిర్ ఖాన్ విడాకులకు దారితీసిన ప‌రిస్థితుల‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆమిర్ విడాకులు తీసుకోవ‌డం కంటే కూడా మెహ్రీన్ నిశ్చితార్థం ర‌ద్దు చేసుకోవ‌డ‌మే ఎక్కువ సంచ‌ల‌నం రేపుతోంది.

అస‌లు కెరీర్లో మంచి స్థితిల ఉండ‌గా మెహ్రీన్ పెళ్లికి సిద్ధం కావ‌డ‌మే ఆశ్చ‌ర్యం అనుకుంటే.. ఒక పెళ్లి స్థాయిలో గ‌త ఏడాది ఘ‌నంగా నిశ్చితార్థం చేసుకుని భారీ స్థాయిలో ఫొటో షూట్లు కూడా చేసుకుని కొన్ని ఫొటోల‌ను మీడియాకు కూడా రిలీజ్ చేసిన మెహ్రీన్.. ఇప్పుడిలా భ‌వ్య బిష్ణోయ్ నుంచి విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించడం అనూహ్యం. అస‌లు క‌రోనా లేకుంటే ఈపాటికే వీరి పెళ్లి కూడా అయిపోయేదేమో.

కాగా భవ్య‌తో మెహ్రీన్ విడిపోవ‌డానికి కార‌ణం ఆమెకు సినిమాల‌పై ఉన్న ప్రేమే అని తెలుస్తోంది. భ‌వ్య బిష్ణోయ్‌ది పేరున్న పొలిటిక‌ల్ ఫ్యామిలీ. పెళ్లి త‌ర్వాత మెహ్రీన్ సినిమాలు చేయ‌డం వారికి ఇష్టం లేద‌ట‌. ఈ విష‌యంపై ముందుగా ఏమీ అనుకోకున్న‌ప్ప‌టికీ.. నిశ్చితార్థం త‌ర్వాత మెహ్రీన్ మ‌ళ్లీ సినిమాల ప‌ట్ల ఆస‌క్తి చూపించ‌డం, చేతిలో ఉన్న సినిమాల‌కు తోడు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవ‌డం ప‌ట్ల‌ భ‌వ్య, అత‌డి కుటుంబంలో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయ‌ని.. ఇన్నాళ్లూ స్వేచ్ఛ‌గా సినిమాలు చేసుకున్న తాను ఇక‌పై ఈ పెద్ద కుటుంబంలోకి వెళ్లి సినిమాల‌కు దూరం కావ‌డం ఇష్టం లేకే త‌న‌కిది స‌రిప‌డ‌ద‌ని భవ్య‌తో నిశ్చితార్థాన్ని ఆమె ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని నెల‌ల ఆలోచ‌న త‌ర్వాత ఆమె ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎఫ్‌-2తో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సంతోష్ శోభ‌న్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంది మెహ్రీన్.

This post was last modified on July 4, 2021 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్టర్ ముందూ ‘మంచు’ వారి వాదులాట

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…

10 minutes ago

భారతీయ రైల్వే సూపర్ యాప్… ఇది కదా కావాల్సింది!

భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…

29 minutes ago

‘తండేల్’ రేట్లు, షోల సంగతేంటి?

అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…

32 minutes ago

బాబొచ్చారు కదా… సోనూ కూడా వచ్చేశారు

సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…

34 minutes ago

ఆ సందర్భంలో జగన్ ను డిస్ క్వాలిఫై చేయొచ్చు: రఘురామ

వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…

59 minutes ago

పవన్ కళ్యాణ్ రిలీజుల చర్చ మళ్ళీ షురూ

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…

1 hour ago