బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ముందుగా రీనా దత్తాను 1986లో పెళ్లాడి ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోవడం తెలిసిందే. ఆ తర్వాత మూడేళ్లకు తన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్న కిరణ్ రావును పెళ్లాడాడు. ఆమెతో కలిసి సినిమాలు తీశాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. వీళ్లిద్దరూ విడిపోతారన్న ఆలోచనే ఎవరికీ లేదు. కానీ శుక్రవారం హఠాత్తుగా ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ఉమ్మడిగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ వార్త బయటికి వచ్చిన కాసేపటికే ట్విట్టర్లో ఫాతిమా సనా షేక్ పేరు ట్రెండ్ అవుతుండటం గమనార్హం.
ముందుగా ఆమిర్ పేరు ట్రెండ్ కాగా.. ఆ తర్వాత ఫాతిమా పేరు అంత కన్నా ఎక్కువగా ట్రెండ్ అవడం మొదలైంది. ఆమిర్‌తో ఫాతిమాకు ఎఫైర్ ఉన్నట్లు గతంలో గట్టిగా ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ఫాతిమా తీవ్రంగా ఖండించింది. ఆమె తొలిసారిగా ఆమిర్‌తో కలిసి దంగల్ సినిమాలో నటించింది. వాళ్లిద్దరూ అందులో తండ్రీ కూతుళ్లుగా నటించడం గమనార్హం. ఆ వెంటనే ఆమిర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లో ఫాతిమా కీలక పాత్ర చేసింది. అప్పుడు మొదలయ్యాయి వీళ్లిద్దరి బంధం గురించి గుసగుసలు. ఐతే ఫాతిమా ఆ రూమర్లపై తీవ్రంగా స్పందించడంతో రూమర్లు ఆగాయి. కానీ ఇప్పుడు ఆమిర్.. కిరణ్ నుంచి విడాకులు తీసుకోవడంతో మళ్లీ ఫాతిమా పేరు తెరపైకి వచ్చింది. ఆమిర్‌తో ఆమె ఎఫైర్ వల్లే కిరణ్ విడాకులు తీసుకుందని.. త్వరలోనే ఫాతిమా ఆమిర్ చెంతకు చేరడం ఖాయమని.. వీళ్లిద్దరికీ లైన్ క్లియర్ అయిందని మీమ్స్ వేస్తూ ఫాతిమా పేరును ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on July 4, 2021 11:14 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…