త్రివిక్రమ్-తారక్.. ఆ టైటిల్ అయితే కాదు!

ఎన్టీఆర్ పుట్టినరోజుకి #ఎన్టీఆర్30 టైటిల్ అనౌన్స్ అవుతుందని ఫాన్స్ ఆశపడ్డారు. ఆర్.ఆర్.ఆర్. కి కూడా ఏమీ స్పెషల్ విడుదల చేయకపోవడంతో హారిక హాసిని వాళ్ళు ‘అరవింద సమేత’ డైలాగ్ ప్రోమో వేసి సరిపెట్టారు. ఈ సినిమా కోసం ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.

ఫాన్స్ కూడా ఈ టైటిల్ తో పోస్టర్లు తయారు చేసారు. త్రివిక్రమ్ కి ఈ టైటిల్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఈ చిత్రానికి టైటిల్ ఇది కాదని, మారుతుందని, అందుకే తొందరపడి అనౌన్స్ చేయలేదని తెలిసింది. త్రివిక్రమ్ సినిమాలకు టైటిల్ కాస్త ఆలస్యంగానే ప్రకటిస్తారు.

తారక్ తో తీసేది పక్కా ఫామిలీ సినిమా కనుక ప్లెజెంట్ గా ఉండే టైటిల్ పెట్టే యోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం.