Movie News

‘ఆహా’ ఓటీటీ దూకుడు

గత ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా ‘ఆహా’ పేరుతో ఓటీటీ మొదలుపెట్టి ఆశ్చర్యానికి గురి చేశారు అల్లు అరవింద్. ఓటీటీ అంటే చాలా పెద్ద వ్యవహారం అని.. వందల కోట్లు చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగాల్సిందే అని.. ప్రాంతీయ భాషలో పరిమిత బడ్జెట్లో ఓటీటీని మొదలుపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని అంతా అనుకున్నారు. ఐతే ఏం చేసినా పక్కా ప్రణాళికలతో, దూర దృష్టితో చేసే అరవింద్.. ఓటీటీ విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

సొంతంగా నిర్మించిన సినిమాలకు తోడు.. కొత్తగా కొన్ని చిన్న సినిమాలను కొనుగోలు చేసి చిన్న స్థాయిలోనే ‘ఆహా’ను మొదలుపెట్టి.. ఆ తర్వాత నెమ్మదిగా కంటెంట్ పెంచుతూ పోయారు. ముందు ఆహాను లైట్ తీసుకున్న వాళ్లు కూడా ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసుకునే పరిస్థితి కల్పించారు. తెలుగు కంటెంట్‌కు తోడు ఇతర భాషల చిత్రాలను తక్కువకు కొనుగోలు చేసి డబ్ చేసి రిలీజ్ చేయడం ద్వారా ‘ఆహా’ కోసం పెట్టే డబ్బులు గిట్టుబాటయ్యేలా చూశారు.

ఈ మధ్యన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య కూడా బాగా పెరిగింది ఆహాలో. కొత్త కంటెంట్‌కు తోడు పాత క్లాసిక్స్‌ను కూడా ఎప్పటికప్పుడు ఆహాలోకి తెస్తోంది దాని టీం. తాజాగా ఆహాలోకి రాబోతున్న 14 చిత్రాలను ప్రకటించారు. అవేమీ కొత్త సినిమాలు కాదు. పాతవే. కానీ అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే క్లాసిక్స్ ఉన్నాయి. భైరవద్వీపం, చిరునవ్వుతో, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, ఈగ, బంగారు బుల్లోడు, ఊహలు గుసగుసలాడే, కొబ్బరి బొండాం, ఘటోత్కచుడు, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్యా లాంటి మంచి సినిమాలున్నాయి అందులో. ఇవి కాక యుద్ధం శరణం, వేటగాడు, లీసా, లాంటి సినిమాలు కూడా ఆహాలోకి రానున్నాయి. ఓవైపు కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు పెద్ద ఎత్తున తీసుకొస్తూ.. ఇలా పాత క్లాసిక్స్‌ను జోడించడం ద్వారా ఉన్న సబ్‌స్క్రైబర్లను నిలబెట్టుకోవడంతో పాటు కొత్త వాళ్లను కూడా బాగానే ఆకర్షిస్తోంది ఆహా.

This post was last modified on July 1, 2021 10:10 pm

Share

Recent Posts

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

2 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

2 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

3 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

5 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

5 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

5 hours ago