అల్లు అర్జున్ హీరోగా ఎప్పుడో మూడేళ్ల కిందట ప్రకటించిన చిత్రం ‘ఐకాన్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం అయిపోయింది. ఒక దశలో ఈ మూవీ క్యాన్సిల్ అయిపోయిందేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. ముందు ప్రకటించిన దీన్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి.. ఆ తర్వాత ‘పుష్ప’ మీదికి వెళ్లిపోయాడు బన్నీ.
వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’తో సత్తా చాటుకున్నాక కూడా బన్నీలో పెద్దగా కదలిక కనిపించలేదు. ‘ఐకాన్’ కథను మరో హీరోతో చేయడానికి వేణు రెడీ అయిపోయినట్లు కూడా వార్తలు రావడం తెలిసిందే. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. ఇంకో మూడు నెలల్లో ఈ సినిమా మొదలవుతుందట.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ పార్ట్-1ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జులై 5న కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. 20 రోజుల చొప్పున రెండు షెడ్యూళ్లు.. మొత్తంగా 40 రోజులు చిత్రీకరణ జరపనున్నారట. అంతటితో పార్ట్-1 షూటింగ్ అయిపోతుందని సమాచారం. ‘ఐకాన్’ కోసమని బన్నీ.. సుకుమార్‌ను మూడు నెలలు సమయం అడిగినట్లు సమాచారం. అందుకు సుక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మూడు నెలలన్నప్పటికీ నాలుగైదు నెలలు ‘ఐకాన్’ కోసం కేటాయించే అవకాశముందని.. ఈ లోపు ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ను రిలీజ్‌కు రెడీ చేయడం.. ఆ సినిమా విడుదల కావడం.. ఆపై సెకండ్ పార్ట్‌కు సంబంధించి స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకుని, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది.
ప్రస్తుతానికి ‘పుష్ప’ పార్ట్-1ను దసరాకు అనుకుంటున్నారు. లేదంటే వీలును బట్టి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. ‘ఐకాన్’ సినిమాను బన్నీ ఈ ఏఢాది చివరికి పూర్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ‘పుష్ప’ పార్ట్-2 షూటింగ్ వచ్చే వేసవిలో మొదలై సినిమా ఆ తర్వాత ఏడాది ఆరంభంలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 1, 2021 2:55 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…