బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకు పోటీగా తయారైన తాప్సి మీద కంగనా రనౌత్ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు తాప్సి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగనా. తాప్సి తనను కాపీ కొడుతుంటుందని.. తనలాగే కనిపించడానికి ప్రయత్నిస్తుందని.. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. ఇలా ఎన్నోసార్లు విమర్శలు చేసింది. తాప్సి చాలాసార్లు సంయమనం పాటిస్తుంటుంది కానీ.. కొన్ని సార్లు మాత్రం ఆమె కూడా నోటికి పని చెబుతుంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కంగనా గురించి అడిగితే చాలా మామూలుగానే జవాబిచ్చిందామె. కానీ అవతలి వాళ్లు సైలెంటుగా ఉన్నా కూడా కెలికే రకమైన కంగనా.. తన గురించి వేరే వాళ్లు కామెంట్ చేస్తే ఊరుకుంటుందా? ఎప్పట్లాగే రెచ్చిపోయి తాప్సి గురించి ఎలా పడితే అలా మాట్లాడేసింది. ఆమెను మరోసారి బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తేలిక చేసే ప్రయత్నం చేసింది.
కంగనా చేసిన అతితో ఆమె మీద ట్విట్టర్ బ్యాన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు పరిమితం అయింది. ఐతే ట్విట్టర్లో కంగనా లేకపోవడం లోటుగా ఉందా అని ఓ ఇంటర్వ్యూలో తాప్సీని అడిగితే.. అలాంటిదేమీ లేదని తేల్చేసింది. ఈ కామెంట్ మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టే పెట్టేసింది కంగనా. తాప్సి పేరెత్తకుండానే ఆమె మీద విమర్శలు గుప్పించింది. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. వేరే వాళ్లు వదిలేసిన పాత్రలను తనకివ్వమంటూ నిర్మాతల్ని ఆమె అడుక్కుంటూ ఉంటుందని వ్యాఖ్యానించింది.
తాప్సీని పేద నిర్మాతల పాలిట కంగనాగా చెప్పుకుంటూ ఉంటారని.. ఆమె తనను కాపీ కొడుతూ ఉంటుందని కూడా కంగనా ఎద్దేవా చేసింది. పాపం కంగనా లేని లోటును ఫీలవుతున్నారా అని అడిగితే లేదు అని చెప్పిన పాపానికి మరీ ఇంతలా తాప్సీని టార్గెట్ చేయాలా అంటూ నెటిజన్లు కంగనా ీమద మండిపడుతున్నారు. కానీ ఆమె ఇలాంటివన్నీ పట్టించుకునే రకమా?
This post was last modified on June 30, 2021 7:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…