మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కేవలం 900 మంది సభ్యులకు పరిమితమైన వ్యవహారం. కానీ దీని చుట్టూ జరిగే హడావుడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా గత రెండు పర్యాయాలు మా ఎన్నికలు ఎంతగా చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఈసారి అంతకుమించిన రచ్చ ఖాయంగా కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. వీరికి తోడు జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్లు అధ్యక్ష పదవికి పోటీ చేస్తామంటున్నారు.
ఐతే ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యే పోటీ కేంద్రీకృతం అవుతుందని భావిస్తున్నారు. వీరికి ఎవరెవరు మద్దతునిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వీరి కోసం పరిశ్రమ రెండుగా చీలిపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
ఐతే మా ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఎవరికి మద్దతిస్తే వాళ్లే విజేతగా నిలుస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీపై ఆయనకున్న పట్టు.. పరిశ్రమలో ఆయనకున్న పలుకుబడి అలాంటిది మరి. ఐతే ఆయన ఓపెన్‌గా మాత్రం ఎవరికీ మద్దతిచ్చే పరిస్థితి లేదు. తెరవెనుక మంత్రాంగం నడిపించే అవకాశముంది. ఐతే చిరు సోదరుడు నాగబాబు బహిరంగంగా ప్రకాష్ రాజ్‌కు మద్దతివ్వడంతో పాటు ఆయనకు చిరు సపోర్ట్ ఉందని ప్రకటించడం గమనార్హం.
అదే సమయంలో మోహన్ బాబు తనయుడైన మంచు విష్ణు రంగంలోకి దిగుతుండటంతో చిరు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మంచి మిత్రులైన వీళ్లిద్దరికీ మధ్యలో కొన్ని అంతరాలు వచ్చాయి. వజ్రోత్సవాల గొడవ, చిరుకు పద్మభూషణ్ ప్రకటించినపుడు తలెత్తిన వివాదం ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాయి. ఈ అగాథాన్ని పూరించుకుని కొన్నేళ్లుగా ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. గత రెండేళ్లలో వివిధ సందర్భాల్లో ఇద్దరూ సన్నిహితంగా మెలగడం చూశాం. ఇలాంటి టైంలో ఇప్పుడు మా ఎన్నికలు ఈ ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెడతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిరు బహిరంగంగా ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇవ్వకపోయినా.. పరోక్షంగా ఆయనకు సాయం చేస్తే, విజయానికి కృషి చేస్తే అది మోహన్ బాబుకు తెలియకుండా ఉండదు. అదే జరిగితే మరోసారి చిరుకు, మోహన్ బాబుకు మధ్య గ్యాప్ రావడం ఖాయం.
This post was last modified on June 29, 2021 9:04 am
గత ఏడాది గదర్ 2తో బాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టి ఫేడవుట్ అయిన సన్నీ డియోల్ కు కొత్త కెరీర్…
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా…
మాములుగానే రష్మిక మందన్న హైపర్ యాక్టివ్ గా మాట్లాడుతుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లేక మరో వేదిక…
నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…