ముందుగా మలయాళంలో ఘనవిజయం సాధించి.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళ, చైనీస్ భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం. ఈ యూనివర్శల్ హిట్‌కు సీక్వెల్‌గా మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం-2 కొన్ని నెలల కిందటే విడుదలై అద్భుతమైన స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని రోజులకే దీని తెలుగు రీమేక్‌ను మొదలుపెట్టేశారు. చాలా తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేశారు.
ఇప్పుడిక దర్శకుడు జీతు జోసెఫ్ తమిళ రీమేక్‌కు సన్నాహాలు చేసుకుంటున్నాడు. దృశ్యం రీమేక్ పాపనాశంలో కథానాయకుడిగా నటించిన కమల్ హాసన్‌తోనే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆయనకు జోడీగా గౌతమి నటించే అవకాశాల్లేవు. వీళ్లిద్దరూ విడిపోయి దూరం అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయడానికి ఆస్కారం లేకపోయింది.
మలయాళం, తమిళ భాషల్లో టనించిన మీనానే.. కమల్‌కు జోడీగా పెడతారని ముందు వార్తలొచ్చాయి. కానీ ప్రతి భాషలోనూ మీనానే అయితే బాగుండదని.. వేరే మిడిలేజ్డ్ హీరోయిన్నే ఆ పాత్రకు ఎంచుకుందామని చూస్తున్నారట. తాజాగా ఈ పాత్రకు సీనియర్ నటి నదియా పేరు వినిపిస్తోంది. నిజానికి పాపనాశంలోనే నదియాను కమల్‌కు జోడీగా నటింపజేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు దృశ్యం-2కు ఆమె దాదాపుగా కమల్‌కు జోడీగా ఖరారైనట్లుగా చెబుతున్నారు.
విశేషం ఏంటంటే.. తెలుగు దృశ్యం, దృశ్యం-2ల్లో నదియా నటించింది. హీరో చేతిలో హత్యకు గురయ్యే అబ్బాయికి తల్లిగా ఆమె కనిపిస్తుంది. ఐతే మలయాళంలో ఆ పాత్రను చేసిన ఆశా శరతే.. తమిళంలోనూ నటించింది. పాపనాశం-2లోనూ ఆమెను అలాగే కొనసాగించనున్నారు. తెలుగులో ఆశా పాత్రను చేసిన నదియాను తమిళంలో హీరోకు జోడీగా చూపించబోతున్నారంటే ఇదొక చిత్రమైన విషయమే.
This post was last modified on June 28, 2021 5:51 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…