సరైన పాత్ర పడాలే కానీ.. ఒక్క సినిమాతో ఎంత ఇంపాక్ట్ వేయొచ్చో చెప్పడానికి ఈగ సినిమాలో సుదీప్ చేసిన నెగెటివ్ రోలే రుజువు. ఆ సినిమాలో పెర్ఫామెన్స్ పరంగా సుదీపే స్టో స్టీలర్. సుదీప్ చేయకుంటే ఈగ సినిమాకు అంత స్థాయి వచ్చేది కాదేమో. కన్నడలో పెద్ద స్టార్ అయిన అతను.. మన దగ్గరొచ్చి విలన్‌గా అంత ప్రభావం చూపడం విశేషమే. ఐతే ఈగ తర్వాత ఇక్కడ బిజీ అయిపోతాడనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. పెద్దగా గుర్తింపులేని కొన్ని పాత్రలు చేసి వెళ్లిపోయాడు.
ఐతే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు సుదీప్ మళ్లీ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో అట. అందులో కథానాయికగా నయనతార నటించనుందట. ప్రధానంగా తమిళంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారట.
త్వరలోనే నేత్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న నయన్.. దాంతో పాటు రజినీకాంత్ సినిమా అన్నాత్తెలో, అలాగే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆమె డ్రీమ్ వారియర్స్ నిర్మాణంలో ఓ కొత్త చిత్రం అంగీకరించింది. ఓ నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిల్మేనట. ఇందులో సుదీప్ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నాడట. మంచి పెర్ఫామర్లయిన ఈ ఇద్దరి మధ్య క్లాష్ అంటే సినిమాకు అంతకుమించిన ఆకర్షణ మరేమీ ఉండదు.
ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో దీనికి హైప్ రావడం ఖాయం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. సుదీప్ ప్రస్తుతం విక్రాంత్ రోణా అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అది త్వరలోనే విడుదల కానుంది.
This post was last modified on June 23, 2021 8:07 am
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…