‘బాలికా వధు’ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయింది అవికా గోర్. ఇదే సీరియల్ ను తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అవికా గోర్ పెర్ఫార్మన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. నార్త్ తో పాటు తెలుగులో కూడా ఆమె క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన ‘ఉయ్యాలా జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి.
కెరీర్ విషయం పక్కన పెడితే.. అవికా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. మిలింద్ ఛద్వాని అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఎప్పటికప్పుడు తన బాయ ఫ్రెండ్ తో ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ఆమెకి సీరియల్ నటుడు మనీష్ రాయ్ సింఘన్ తో ఎఫైర్ ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉందని బాలీవుడ్ మీడియా వర్గాలు ప్రచురించాయి.
తాజాగా ఈ విషయంపై అవికా స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని తెలిపింది. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి మనీష్ తో స్నేహం ఏర్పడిందని.. అతడికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పింది. అతడి నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఇప్పటికీ తమ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా..? అని అందరు అడుగుతున్నారని వాపోయింది.
తన తండ్రి కంటే మనీష్ వయసులో కొంచెం చిన్నవాడని.. సరిగ్గా చెప్పాలంటే తన తండ్రి వయసే ఉంటుందని.. అలాంటి వ్యక్తితో సంబంధం ఉందని కథనాలు వస్తున్నాయని మండిపడింది. మొదట్లో ఈ వార్తలు చాలా ప్రభావం చూపించేవని.. దీంతో మనీష్ తో కొన్నాళ్లు మాట్లాడడం మానేశానని చెప్పింది. ఇప్పటికీ ఈ పుకార్లు వస్తూనే ఉండడంతో.. ఇక మాట్లాడకుండా ఉండడంలో అర్ధం లేదనిపించిందని స్పష్టం చేసింది. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చింది.
This post was last modified on June 22, 2021 12:53 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…