ధనుష్ పాన్ ఇండియా సినిమాలో మరో హీరో!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్, తన భార్య జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించబోతున్నారు.

శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్.. వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ని డైరెక్ట్ చేయబోతున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాను రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

ఇందులో ధనుష్ తో పాటు కథ ప్రకారం.. మరో హీరోకి కూడా చోటుందట. కానీ మిడిల్ ఏజ్డ్ హీరో పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతానికి అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒక పేరుని ఫైనల్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ఓ సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. అలానే తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమాను మొదలుపెడతారు.