‘మీట్ క్యూట్’ బ్యూటీస్ వీళ్లేనా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా సినిమాలు చేస్తూనే.. ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై తనకు నచ్చిన కథలతో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో ‘అ!’, ‘హిట్’ వంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో సినిమాను నిర్మించబోతున్నారు నాని. తన సోదరి దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ ‘మీట్ క్యూట్’ అనే సినిమాను పట్టాలెక్కించారు నాని. కథ ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారని సమాచారం.

ఇందులో ఓ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో ఈమె నాని బ్యానర్ లో ‘అ!’ సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి నాని తన సినిమాలో కాజల్ ని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. పైగా కాజల్ ఈ మధ్యకాలంలో తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుంది. అందుకే నాని ఆమెని ఆన్ బోర్డ్ చేయాలనుకుంటున్నారు. కాజల్ కూడా నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈమెతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అదా శర్మ, రహానే శర్మలను కూడా సంప్రదించారట. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోయిన్ల చేతిలో సినిమాలేవీ లేవు. కాబట్టి అడిగినప్పుడు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వీరితో పాటు సినిమాలో సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.