రూ.175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం!

బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి సహజీవనం చేయాలనుకుంటున్నారు. దీనికోసం ముంబైలోని పోష్ ఏరియా జుహు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ రూ.175 కోట్లు విలువ చేసే బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ కోసం తన రిచ్ బాయ్ ఫ్రెండ్ ఇంత కాస్ట్లీ ఇంటిని కొన్నాడట. జాక్వెలిన్ డేటింగ్ చేస్తోన్న వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందినవాడని.. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టి జుహు ఏరియాలో బంగ్లా కొనగలిగాడు.

త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నారు. అందుకే అంత డబ్బు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారని టాక్. జాక్వెలిన్ కెరీర్ విషయానికొస్తే.. ‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా సైన్ చేసింది. క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే జాక్వెలిన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది .