టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ వెచ్చించనంత సమయం ‘లైగర్’ కోసం కేటాయిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల సినిమా ఆలస్యమైన సంగతి వాస్తవమే అయినప్పటికీ.. మామూలుగా చూసినా ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి. పోకిరి, బిజినెస్‌మ్యాన్ లాంటి సినిమాలను మూడు నెలల లోపు వర్కింగ్ డేస్‌లో పూర్తి చేసిన పూరి జగన్నాథ్.. ‘లైగర్’ కోసం మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది. ఈసారి మాత్రం బ్రేకుల్లేకుండా షూటింగ్ జరిపి సినిమాను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పూరి. రాబోయే షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ ఘట్టాల చిత్రీకరణే ఉంటుందని.. పతాక సన్నివేశాలు కూడా తీయబోతున్నారని సమాచారం.
‘లైగర్’ పతాక సన్నివేశాల్లో తెర నిండా బాక్సర్లు, ఫైటర్లే కనిపించబోతున్నారు. ఐతే అందరూ కొత్త వాళ్లతో నడిపించకుండా ఫేమ్ ఉన్న బాక్సర్లు కొందరు ఫ్రేమ్‌ల్లో కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొందరు ప్రముఖ బాక్సర్లను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రముఖుల్లో వివాదాస్పద బాక్సర్ మైక్ టైసన్ కూడా ఉన్నట్లు సమాచారం. పేద కుటుంబం నుంచి వచ్చి బాక్సర్‌గా ఎనలేని ఫేమ్ తెచ్చుకుని.. ఆ తర్వాత వివాదాలతో సహవాసం చేసి పేరునంతా పోగొట్టుకున్న టైసన్.. ఒక దశలో దివాళా తీశాడు. ఆ తర్వాత డబ్బు కోసం కొన్ని బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం.. తన స్థాయికి తగని పనులు చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఐతే ఎన్ని వివాదాలున్నప్పటికీ టైసన్‌కు ఉన్న ఆకర్షణ మాత్రం వేరు. అతను ఎక్కడుంటే అక్కడ మీడియాలో ఫోకస్ అవుతాడు.
‘లైగర్’ సినిమాలో అతను నటిస్తే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. మరి టైసన్‌ను ఈ చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on June 17, 2021 2:10 pm
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…