జబర్దస్త్ కామెడీ షోలో వచ్చే స్కిట్లు వివాదాస్పదం కావడం.. కేసులు నమోదవడం కొత్తేమీ కాదు. కామెడీ కోసం కొన్నిసార్లు అందులోని పాత్రధారులు హద్దులు దాటి కొందరి సెంటిమెంట్లను గాయపరచడం జరుగుతుంటుంది. గతంలో ఒక స్కిట్లో వేణు చేసిన విన్యాసాలు నచ్చక ఓ వర్గం వాళ్లు అతడిపై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఈ దెబ్బతో అతను ఈ షోకే దూరం కావాల్సి వచ్చింది. షకలక శంకర్ చేసిన ఓ స్కిట్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం తెప్పించడం, అతను క్షమాపణలు చెప్పడం తెలసిిందే. ఇలా ఆ తర్వాత కొన్ని స్కిట్లు వివాదాస్పదం అయ్యాయి.
తాజాగా ఇప్పుడు మరో స్కిట్ వివాదాస్పదంగా మారింది. ఈ స్కిట్ చేసింది ప్రస్తుతం జబర్దస్త్‌లో నంబర్ వన్ కమెడియన్ అనదగ్గ హైపర్ ఆది కావడం విశేషం. ఐతే వివాదానికి కారణమైంది జబర్దస్త్ స్కిట్ కాదు. అందులో మాదిరే మరో టీవీ కార్యక్రమంలో చేసిన స్కిట్.
తెలంగాణ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆది తాజాగా ఒక స్కిట్ చేశాడు. ఈ ఆదివారం ఓ కార్యక్రమంలో భాగంగా అది ప్రసారమైంది. అందులో ఉయ్యాలో ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాట పాడుతూ కమెడియన్లందరూ చుట్టూ తిరిగే దృశ్యం ఉంది. బతుకమ్మ పాట మీద కామెడీ చేస్తూ కొంచెం సెటైరిగ్గా ఈ సన్నివేశాలను నడిపించారు. ఇది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
తెలంగాణ గ్రామదేవతల పండుగలను, ఇక్కడి ప్రజల యాస భాషలను కించపరిచేలా ఈ స్కిట్ ఉందని, హైపర్ ఆదితో పాటు ఈ స్కిట్ రైటర్, దీన్ని ప్రొడ్యూస్ చేసిన మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పండుగను ఈ స్కిట్లో అవహేళన చేశారని.. ద్వంద్వార్థాలు వచ్చే డైలాగులతో తెలంగాణ భాష, యాసలను కించపరిచారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా కేసు నమోదైనట్లు తెలియగానే సదరు ఎపిసోడ్‌ను నిర్వాహకులు యూట్యూబ్ నుంచి తొలగించేయడం గమనార్హం.
This post was last modified on June 15, 2021 1:03 pm
ఒక పెద్ద నటుడి కుటుంబం నుంచి ఒకరు నటనలోకి వస్తే.. ఆటోమేటిగ్గా వాళ్లు ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం…
టాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ఒక హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో..…
దళిత సామాజిక వర్గంలో బీసీల మాదిరే చాలా కులాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఎస్సీలుగా పరిగణిస్తున్నాం. బీసీల మాదిరే తమకూ…
నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం…
హీరోలన్నాక ఫ్లాపులు సహజం. కాకపోతే వరసగా వస్తేనే ఇబ్బంది. నితిన్ కు ఈ సమస్య ఎదురయ్యింది. ప్రతిసారి ఒక హిట్టు…
యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…