గాయనిగా పరిచయమై నటిగా సెటిలైపోయిన తమిళ అమ్మాయి ఆండ్రియా జెరెమీ. మత్తెక్కించే వాయిస్‌తో ఆమె పాడిన పాటలు క్లాసిక్స్ లాగా నిలిచిపోయాయి తమిళంలో. సెక్సీ లుక్స్‌తో ఉండే ఈ అమ్మాయి దర్శకుల దృష్టిని ఆకర్షించి ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేసింది. అవి బాగా క్లిక్ కావడంతో తర్వాత పూర్తి స్థాయిలో నటిగా మారింది. కథానాయికగా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది. ఐతే ఆండ్రియా రెగ్యులర్ హీరోయిన్ల పాత్రలు చేయడం తక్కువ. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే క్యారెక్టర్లు ఒప్పుకుంటుంది. పాత్రలు డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్‌గా అయినా నటించడానికి ఆమె వెనుకాడదు. తెలుగులోకి కూడా అనువాదం అయిన తరమణి లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ.
ఇప్పుడు ఆండ్రియా తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న సినిమా.. పిసాసు-2. విలక్షణ చిత్రాలు తీసే మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. తెలుగులోకి పిశాచి పేరుతో అనువాదమై ఇక్కడా మంచి ఫలితాన్నందుకున్న చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ఆండ్రియాదే లీడ్ రోల్. తన సినిమాల్లో కథానాయికల పాత్రలను చాలా భిన్నంగా ప్రెజెంట్ చేస్తాడు మిస్కిన్. అవి కొంచెం బోల్డ్‌గా కూడా ఉంటాయి.
పిసాసు-2లో బోల్డ్‌నెస్ కొంచెం ఎక్కువే అని.. ఒక సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా కూడా కనిపించనుందని కోలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి. సెమీ న్యూడ్‌గా కనిపించే ఆ సన్నివేశాన్ని తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ మధ్య తెరకెక్కించారట. ఈ పాత్ర కచ్చితంగా ఆండ్రియా కెరీర్లో ఒక మైలురాయి అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆండ్రియా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on June 14, 2021 8:44 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…