మరో రెండు తరాల వరకు కాపాడుకుంటా!

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? అనే విషయంలో తనకు బాధ లేదంటూనే అతడి రాకతో పార్టీకి నష్టం కలిగితే ఏం చేస్తారంటూ ప్రశ్నించారు బాలయ్య.

ఆ తరువాత తనలో ఉన్న భాష, సాహిత్యం, జ్ఞానం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ అంటే ఒక మీడియా.. ఓన్లీ బాలకృష్ణ.. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంటూ వివరించారు. భాషను బతికించాలంటే అది తన వల్లే అవుతుందని.. తనతోనే అంతరించుకుపోతుందని.. ఇది మాత్రం గ్యారంటీ అని.. ఛాలెంజ్ చేశారు. ఆర్టిస్ట్ అంటే నవ్వడమో.. ఏడవడమో కాదని.. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం, ఆత్మలోకి వెళ్లడం, దాని తాలూకా అనుభూతుల్లోకి వెళ్లడమని చెప్పారు.

పాత్రలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ తనను తాను గిచ్చుకుంటూ ఉంటానని.. ఎందుకంటే ”ఒరేయ్ నువ్ ఆ పాత్రవి కావు.. బాలకృష్ణవి అని తెలియడం కోసం” అని అన్నారు. మరో రెండు తరాల వరకు భాషను బతికించుకోగలుగుతానని చెప్పుకొచ్చారు. బాలయ్యకు తెలుగు భాషపై ఉన్న పట్టు గురించి తెలిసిందే. సందర్భం వచ్చిన ప్రతీసారి ఆయన తన టాలెంట్ ను బయటపెడుతూనే ఉంటారు. గతంలో శివశంకర పాట పాడిన బాలయ్య ఇటీవల శ్రీరామ దండకం వినిపించారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)