టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాను తెరకెక్కిస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే ఇప్పుడు చిన్న సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాను నిర్మించింది. అమెజాన్ లో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కేవలం రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమాను అమెజాన్ సంస్థ ఏకంగా తొమ్మిది కోట్లు పెట్టి కొనుక్కుంది.
దానికి కారణం యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ అనే చెప్పాలి. చిన్న సినిమాల్లో ఇంత లాభం ఉందని గ్రహించిన ఈ సంస్థ ఇప్పుడు అదే తరహాలో మరిన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతోంది. ‘ఏక్ మినీ కథ’కు స్టోరీ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో మరో కథ రెడీ చేయించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. అది కూడా ఓ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది. ఇది కాకుండా మారుతితో సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టింది.
ఇందులో కూడా సంతోష్ శోభన్ నే హీరోగా తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా రెండు కోట్ల లోపే అని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తవ్వక ముందే బేరం కుదిరిపోయిందట. ‘ఆహా’ సంస్థ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ సినిమా రైట్స్ ను తీసుకుందట. దాదాపు అనుకున్న బడ్జెట్ కి మూడు రెట్లు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో లాభాలు రావడం విశేషమనే చెప్పాలి. భవిష్యత్తులో యూవీ సంస్థ మరిన్ని చిన్న సినిమాలను రావడం ఖాయం!
This post was last modified on June 11, 2021 7:22 am
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…