ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ రిలీజ్‌కు ముందు, తర్వాత చర్చంతా సమంత అక్కినేని గురించే. ఈ సిరీస్‌లో లీడ్ రోల్ చేసిన మనోజ్ బాజ్‌పేయి సెకండ్ సీజన్‌లోనూ అదరగొట్టేశాడు. ఆయన పెర్ఫామెన్స్ గురించి ఎంతమాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ రెండో సీజన్ రిలీజ్ ముంగిట సమంత పాత్ర గురించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టంతా దాని మీదే నిలిచింది. ఇక సిరీస్ చూశాక అందరూ సమంత గురించే మాట్లాడుకున్నారు.
ఎల్టీటీఈ సభ్యురాలైన రాజి పాత్రలో సమంత ఇచ్చిన పెర్ఫామెన్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. పాత్రగా కూడా అది బాగా ఆకట్టుకుంది. కొన్ని బోల్డ్ సీన్స్, అలాగే యాక్షన్ ఘట్టాలైతే మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. సినిమాలతో వచ్చిన పేరు కంటే ఈ సిరీస్‌కు ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది సమంత.
రాజి పాత్రతో ఇంతగా ఈ సిరీస్‌కు ఆకర్షణగా నిలిచిన సమంత.. ఈ పాత్ర కోసం ఎంత పారితోషకం తీసుకుని ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఓ సినిమాకు సామ్ గరిష్టంగా తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.2 కోట్లు కాగా.. ఫ్యామిలీ మ్యాన్-2లో రాజి పాత్ర కోసం మాత్రం దాని మీద రెట్టింపు మొత్తం అందుకుందట. ఈ సిరీస్ కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడం, పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా చాలా ఉండటంతో ఆమెకు భారీ పారితోషకమే ఇచ్చారట. ఇక షోలో ఆమె పెర్ఫామెన్స్ చూశాక ఆ పారితోషకం ఎంతమాత్రం ఎక్కువ కాదు అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ మ్యాన్-2 తర్వాత ఆమెకు వెబ్ సిరీస్‌లో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. సినిమాల్లో కథ ముగిసిపోయినా వెబ్ సిరీస్‌లతో ఆమె కెరీర్‌ను కొనసాగించడానికి స్కోప్ బాగానే ఉంది.
This post was last modified on June 10, 2021 8:44 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…