తెలుగు స్ట్రెయిట్ సినిమాలో ధనుష్!

కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. అతడు ఎన్నుకునే కథలు, నటించే పాత్రలు వేరే లెవెల్ లో ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ కాకుండా సరికొత్త కథలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటారు. ఇప్పటివరకు ఆయన స్ట్రెయిట్ సినిమాలో కనిపించినప్పటికీ.. ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ధనుష్ నటించిన ‘అసురన్’,’కర్ణన్’ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు సైతం బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటివరకు తమిళంలోనే సినిమాలు చేస్తూ ఉన్న ఈ హీరోని ఇప్పుడు టాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే నిర్మాత దిల్ రాజు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగులో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అలానే దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో సినిమా లైన్ లో పెట్టారు. ఇప్పుడు ఇదే బాటలో హీరో ధనుష్ ని తెలుగులో డైరెక్ట్ గా పరిచయం చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ కి చెందిన అగ్ర నిర్మాణ సంస్థ ఓ పెద్ద దర్శకుడితో కలిసి ఈ కాంబినేషన్ సెట్ చేయాలనుకుంటుంది.

ఈ సినిమాను మూడు భాషల్లో నిర్మించాలనుకుంటున్నారు. కథ ప్రకారం.. సినిమాకి మరో సీనియర్ హీరో కూడా అవసరం ఉందట. ఆ దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సెట్ అయి, ధనుష్ డేట్స్ ఇస్తే అప్పుడు అధికారికంగా అనౌన్స్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కథ తెలుసుకున్న ఓ స్టార్ హీరో తను నటిస్తానని దర్శకనిర్మాతలకు ఆఫర్ ఇస్తున్నాడట. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!