దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే ఉత్తమ తొలి చిత్ర నటిగా జీ సినీ అవార్డుని అందుకుంది. ఆ తరువాత ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా’ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. గతేడాది ఆమె నటించిన ‘రూహి’ అనే హారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఈ లాక్ డౌన్ సమయంలో పలు ఫోటో షూట్లు, పెయింటింగ్ అంటూ కాలక్షేపం చేస్తోంది జాన్వీ.
ఈ మధ్యకాలంలో జాన్వీ తన గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ బికినీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది జాన్వీ. వీటికి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు ఆమెని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. బికినీ ధరించినప్పటికీ ఎక్కడా వల్గారిటీ లేకుండా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
గతంలో ఈ బ్యూటీ ఎక్స్‌పోజింగ్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తన హద్దుల్లో తాను ఉంటూ, అవసరమైన మేర అందాల ప్రదర్శనకు వెనుకడగు వేయనని చెప్పింది. ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘దోస్తానా 2’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే మరికొన్ని కథలను కూడా వింటోంది. త్వరలోనే ఈమెను టాలీవుడ్ కి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 6, 2021 12:47 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…