Movie News

అక్కడ థియేటర్లు తెరుచుకుంటున్నాయ్


గత నెల రోజుల ముందు నుంచి దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు మూతపడి ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొంచెం తగ్గింది కానీ.. ముప్పు అయితే తొలగిపోలేదు. సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్లా లాక్ డౌన్ అమలవుతుండగా.. వచ్చే నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఆగస్టుకో లేదంటే దసరాకో కానీ థియేటర్లు పున:ప్రారంభం కావని అంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న అంచనాలున్నాయి.

కానీ ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో రాబోయే సోమవారం నుంచి థియేటర్లు పున:ప్రారంభం అవుతుండటం గమనార్హం. 50 శాతం ఆక్యుపెన్సీతో అక్కడ థియేటర్లు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి తీవ్రంగా దెబ్బ తిన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రనే ముందుంటోంది. కేసులు, మరణాల్లో ఆ రాష్ట్రానికి మరే స్టేట్ కూడా దరిదాపుల్లో లేదు. ఒక టైంలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింట్లో నమోదైన కేసులు, మరణాలతో సమానంగా మహారాష్ట్రలోనే కేసులు వచ్చాయి, మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అందరికంటే ముందు లాక్ డౌన్ పెట్టింది ఆ రాష్ట్రమే.

ఏడాది నుంచి అక్కడ థియేటర్లు చాలా వరకు మూతపడి ఉన్నాయి. అవి తెరుచుకున్న సమయంలోనూ నామమాత్రంగా నడిచాయి. హిందీలో పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకుని మహారాష్ట్రలో థియేటర్లు ఒకప్పటిలా నడవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అప్పుడే థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవడానికి అనుమతులివ్వడం ఆశ్చర్యకరమే. ఐతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎక్కువ దెబ్బ తిన్న మహారాష్ట్ర.. ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల వైరస్ ప్రభావాన్ని తగ్గించగలిగింది. అక్కడ కేసులు, మరణాల సంఖ్య బాగా తగ్గిన నేపథ్యంలోనే లాక్ డౌన్ షరతులు సడలించి థియేటర్లకు అనుమతులిచ్చినట్లు తెలుస్తోంది.

This post was last modified on June 6, 2021 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

3 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

4 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

4 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

5 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

5 hours ago