నటీనటుల పని దర్శకులు చెప్పింది చేసుకుపోవడమే. ఆయా పాత్రల లక్షణాల గురించి వాళ్లను తప్పుబట్టడానికి ఏమీ ఉండదు. విషయం లేదనుకున్న పాత్రలను తిరస్కరించడం చేస్తారు కానీ.. నటులుగా తమకు సవాలు విసిరే పాత్రలు వచ్చినపుడు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఆ పాత్రలు తమకు ఎంత పేరు తెస్తాయి అని చూస్తారు కానీ.. వాటి తాలూకు వివాదాలతో వాళ్లకు అసలు సంబంధం ఉండదు.
కానీ సినిమాకు సంబంధించి ముఖచిత్రంగా కనిపించేది నటీనటులే కావడంతో పాత్రల తాలూకు వివాదాల్ని వాళ్లకు ఆపాదించి టార్గెట్ చేస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌లో భాగంగా ఆమె చేసిన టెర్రరిస్టు లక్షణాలున్న పాత్ర తనను వివాదంలోకి లాగింది. ట్రైలర్లో సమంత పాత్రను చూడగానే ఆమె ఎల్టీటీఈ సభ్యురాలిగా కనిపించనున్న సంగతి పసిగట్టి తమిళ టైగర్లను టెర్రరిస్టులుగా చూపిస్తారా అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు తమిళులు.
ఫ్యామిలీ మ్యాన్-2 రిలీజయ్యాక స్పందించాలని, తమిళుల మనోభావాలను కించపరిచేలా ఇందులో ఎలాంటి అంశాలుండవని దర్శకులు రాజ్-డీకే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా తమిళ జనాల ఆగ్రహం చల్లారలేదు. తాజాగా షేమ్ ఆన్ యు సమంత అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఆమెను ట్రోల్ చేశారు. సిరీస్ తీసిన దర్శక నిర్మాతలను కాకుండా సమంతను ఇలా టార్గెట్ చేయడం విడ్డూరం.
ఈ సిరీస్ చేసినందుకు గాను సమంత చేసే వేేరే సినిమాలను కూడా బహిష్కరించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. అసలే సమంత పెళ్లి తర్వాత తమిళంలో సినిమాలు బాగా తగ్గించేసింది. సెలెక్టివ్ రోల్స్ ఎంచుకుంటోంది. ఇప్పుడు ఈ వివాదం పుణ్యమా అని కోలీవుడ్లో ఆమె కెరీర్ ముగింపు దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజై అందులో తమిళులు లేవనెత్తుతున్న అభ్యంతరాలే ఉంటే మాత్రం తమిళంలో సమంత కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే. ఆమెకు అవకాశం ఇచ్చిన వాళ్లను కూడా టార్గెట్ ఇచ్చే అవకాశముంది కాబట్టి.. ఎందుకొచ్చిన వివాదంలే అని ఆమెకు తలుపులు మూసేయడం గ్యారెంటీ.
This post was last modified on %s = human-readable time difference 4:56 pm
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…