70-80 మధ్య పుట్టిన వారికి.. తొంభైలకు యూత్ లో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అబ్బాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. తన అందంతో.. స్కిన్ టోన్ తో ఎంతోమంది అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసిన ఈ కలల రాకుమారుడు..కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. తొంభైలలో వచ్చిన ప్రేమదేశం మూవీ అప్పట్లో పెను సంచలనం. అప్పటి యూత్ ఏమాత్రం ఆలోచించలేని కాన్సెప్టును తీసుకొని తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి.. స్వల్ప వ్యవధిలో హీరోగా.. విలన్ గా యాభై సినిమాలు చేసిన అబ్బాస్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. మరి.. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండటమే దీనికి కారణం. కొంతకాలంగా అందుబాటులో లేని ఆయన ఈ మధ్యనే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివసిస్తున్న అబ్బాస్.. పూర్తిగా న్యూజిలాండ్ వాసిగా మారిపోయారు. కుటుంబంతో సహా సెటిల్ అయిపోయిన అతను ఇప్పుడా దేశంలో మోటివేషనల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గి.. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న అతడు.. తీవ్రమైన డిప్రెషన్ లోకి కూరుకుపోయాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి.. ఆపై న్యూజిలాండ్ లో ల్యాండ్ అయ్యాడు.
అక్కడికి వెళ్లిన కొత్తల్లో పెట్రోల్ బంకుల్లో పని చేశాడు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ గా మారి.. వేలాది మందిలో కొత్త స్పూర్తిని నింపుతున్నారు. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఇతగాడి రియల్ స్టోరీతో ఏకంగా సినిమానే తీసేందుకు సరిపడా కథ ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on June 8, 2021 3:18 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…