పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి పెద్ద రైటర్లు, దర్శకులతో పని చేసిన సందర్భాలు తక్కువగా కనిపిస్తాయి. త్రివిక్రమ్ కూడా రెండు సినిమాల అనుభవంతో ఉన్నపుడే పవన్‌తో జట్టు కట్టాడు. ఆయనతో వ్యక్తిగతంగానూ కుదిరిన స్నేహం వల్ల ఇంకో రెండు సినిమాలు చేశాడు కానీ.. స్టార్ దర్శకులకు చాలా వరకు దూరంగానే ఉంటాడు పవన్. ఆయనకున్న ఇమేజ్‌కి విజయేంద్ర ప్రసాద్ లాంటి రైటర్ కథ రాస్తే.. రాజమౌళి లాంటి దర్శకుడు దాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేస్తుంటుంది. మరి ఇదే మాట విజయేంద్ర ప్రసాద్ దగ్గర ప్రస్తావిస్తే ఆయనేమన్నారో తెలుసా..?
పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్ అని.. చిన్న నిప్పురవ్వ అతడికి చాలని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. పవన్‌తో సినిమా తీయాలంటే ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం కూడా లేదని.. కేవలం ఆయన్ని చూడ్డానికే జనాలు థియేటర్లకు వస్తారని ఆయనన్నారు. ఇప్పటిదాకా పవన్ చేసిన సినిమాల నుంచి ఒక్కో ముక్క తీసుకొచ్చి పెట్టేసి పాటలు, ఫైట్లు పెట్టేస్తే సినిమా వర్కవుట్ అయిపోతుందని విజయేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ ఎలివేషన్ చూసి పవన్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. దీని మీద మీమ్స్ చేసి సోషల్ మీడియా పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ పవన్‌కు ఇలాంటి ఎలివేషన్ ఇవ్వడం కొత్త కాదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ఇంటర్వెల్ సీన్ ఎంత ఉద్వేగభరితంగా ఉంటుందో తెలిసిందే. హీరో ఎలివేషన్ అంటే అంతకుమించిన సన్నివేశం కనిపించదు. ఆ సన్నివేశానికి పరోక్షంగా పవన్ కళ్యాణే స్ఫూర్తి అని ఆయన గతంలో వెల్లడించారు. ఒక సినిమా వేడుక సందర్భంగా వేదిక మీద ఉన్న వాళ్లు పవన్ పేరెత్తినపుడల్లా అభిమానులు ఆడిటోరియాన్ని హోరెత్తించేయడం చూసి.. దాని స్ఫూర్తితో ఈ సన్నివేశం రాసినట్లు ఆయన చెప్పడం పవన్ అభిమానులకు అమితంగా నచ్చేసింది.
This post was last modified on June 2, 2021 6:24 am
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…