Movie News

బోయపాటి ఉన్నాడు.. బాలయ్య ధైర్యం చేస్తాడా?

నందమూరి బాలకృష్ణను సంక్రాంతి హీరో అనేవాళ్లు ఒకప్పుడు. ఆ పండక్కి సినిమాలు రిలీజ్ చేయడం బాలయ్యకు చాలా ఇష్టం. సెంటిమెంటు కూడా. సంక్రాంతికి వచ్చిన చాలా బాలయ్య సినిమాలు అద్భుత విజయం సాధించాయి కూడా. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘నరసింహనాయుడు’ సైతం సంక్రాంతికి వచ్చిన సినిమానే.

2016-2019 మధ్య వరుసగా నాలుగేళ్లు బాలయ్య సంక్రాంతి సినిమాలతో పలకరించాడు. ఐతే గత ఏడాది పండక్కి వచ్చిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ మాత్రం బాలయ్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘రూలర్’ సినిమాను ముందు సంక్రాంతికే అనుకున్నారు కానీ.. తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.

‘యన్.టి.ఆర్’ బాలయ్య ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి ఉండొచ్చు. ‘రూలర్’ సినిమా మీద కూడా అంచనాలు పెద్దగా లేకపోవడం, సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ చిత్రాలు షెడ్యూల్ కావడంతో బాలయ్య భయపడ్డట్లున్నాడు.

దీంతో గత ఏడాది డిసెంబరు 20నే ‘రూలర్’‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫలితం చూశాక బాలయ్య మంచి నిర్ణయమే తీసుకున్నాడని అనిపించింది. ఐతే ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన చర్చ నడుస్తోంది. మామూలుగా అయితే బాలయ్య అండ్ టీంకు సంక్రాంతి రిలీజ్ ఆలోచనలే లేవు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. పైగా వచ్చే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ కావడంతో దానికి ఎదురెళ్లే పరిస్థితి లేకపోయింది.

కానీ లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగే బాలయ్య చిత్రమూ ఆలస్యం అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంత ఈ ఏడాది చివరికి చిత్రీకరణ పూర్తి చేసి బాలయ్య సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అవకాశముంది. ఆ పండక్కి చిరు సినిమా ‘ఆచార్య’ లేదంటే పవన్ మూవీ ‘వకీల్ సాబ్’ వచ్చే అవకాశముంది. సంక్రాంతికి చిరుతో పోటీ అంటే బాలయ్య ఎప్పుడూ సై అంటాడు. పవన్‌తోనూ సంక్రాంతికి తలపడ్డ అనుభవముంది. బోయపాటి అండ ఉంది కాబట్టి ఈసారి ధైర్యం చేసి సంక్రాంతి రేసులో బాలయ్య నిలబడే అవకాశాలు లేకపోలేదు.

This post was last modified on May 16, 2020 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

60 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago