Movie News

ఒక్కమగాడు ఎందుకు పోయిందంటే..

అది 2007. ‘దేవదాసు’ సినిమాతో భారీ విజయాన్నందుకున్న వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఒక్కమగాడు’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేయగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం. సినిమా మేకింగ్ దశలో, రిలీజ్ ముంగిట ఈ సినిమా గురించి ఎంతో చర్చ. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందనే అంచనాల మధ్య తర్వాతి ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మార్నింగ్ షో పడగానే అంతటా హాహాకారాలు. నందమూరి అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. పూర్తి సినిమా చూడలేక అల్లాడిపోయారు.

వైవీఎస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశాడేంటంటూ అతడికి శాపనార్థాలు పెట్టారు. బాలయ్య కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా చిత్రం. సినిమా రిలీజయ్యాక చౌదరి నోటికి తాళం పడిపోయింది. ‘ఒక్క మగాడు’ గురించి మాట్లాడ్డానికే భయపడ్డాడు.

ఐతే ఈ మధ్య మరీ సైలెంట్ అయిపోయిన చౌదరి.. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా, తర్వాత ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ మీద పెట్టిన ఒక స్పేస్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘ఒక్కమగాడు’ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ఆ సినిమా విషయంలో తాను చేసిన తప్పేంటో ఆయన వివరించాడు.

‘ఒక్క మగాడు’కు ముందు బాలయ్య చేసిన కొన్ని సినిమాల్లో ఉన్న విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ పాటలు.. ‘‘నేను నరికానంటే ఏ ముక్క ఎక్కడ పడిందో వెతుక్కోవడానికి వారం పడుతుంది’’ లాంటి డైలాగుల వల్ల ఆయన యూత్‌కు దూరం అయిపోయారని.. సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెడీ నడిచిందని.. అందుకే హింస లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్, సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌, యూత్‌కు నచ్చేలా ఒక కాజ్ కోసం కథ నడిచేలా, ఒక ప్రాపర్ సినిమా తీయాలని అనుకున్నానని.. ఈ ఆలోచనే పెద్ద తప్పు అయిందని, అందువల్లే ‘ఒక్క మగాడు’ దెబ్బ తిందని చౌదరి అన్నాడు. కానీ ‘ఒక్క మగాడు’ చూశామంటే చౌదరి ఏవైతే వద్దు అనుకున్నాడో అవే ఉంటాయి. విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ మాటలు, పాటలే కనిపిస్తాయి సినిమా అంతా. ముఖ్యంగా హీరోయిన్లను చాలా వల్గర్‌గా చూపించి, విపరీతమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్, సీన్స్, సాంగ్స్ పెట్టి ఫ్యామిలీస్‌తో సినిమా చూడలేని విధంగా తయారు చేసిన చౌదరి.. ఇప్పుడిలా మాట్లాడ్డం విడ్డూరం.

This post was last modified on May 31, 2021 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

2 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

2 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

3 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

4 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

5 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

5 hours ago