చాందిని అనే చిన్న స్థాయి తమిళ నటి వ్యవహారం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే సారథ్యంలో మంత్రిగా పని చేసిన మణికందన్ అనే నాయకుడిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఐదేళ్లకు పైగా తనతో సహజీవనం చేసిన మణికందన్.. తనను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడని ఆమె ఆరోపించింది. మీడియా ముందుకొచ్చి తమ బంధం గురించి ఫొటో ఆధారాలు చూపించి మరీ ఆమె ఈ ఆరోపణలు చేసింది.
తెలుగులోకి ‘శంభో శివ శంభో’ పేరుతో రీమేక్ అయిన తమిళ సినిమా ‘నాడోడిగల్’ సహా కొన్ని సినిమాల్లో చాందిని నటించింది. గత కొన్నేళ్లలో ఆమె అంత లైమ్ లైట్లో ఏమీ లేదు. కాగా మంత్రి మణికందన్‌ను ఒక కార్యక్రమంలో భాగంగా కలిశానని.. తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తమ మధ్య శారీరక సంబంధం కూడా మొదలైందని.. తరచుగా ఆయన బంగ్లాకు వెళ్లి వస్తుండేదాన్ననని చాందిని వెల్లడించింది.
ఐతే తర్వాత ఇద్దరం ఒక ఇల్లు అద్దకు తీసుకుని అందులో సహజీవనం చేశామని.. భార్యతో తనకు సరైన సంబంధాలు లేవని, ఇబ్బందులున్నాయని.. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికందన్ చెప్పాడని.. దీంతో ఆయనతో ఇన్నేళ్లుగా కలిసి ఉన్నానని.. కానీ ఇప్పుడు ఆయన అడ్డం తిరిగాడని చాందిని ఆరోపించింది. తనతో మణికందన్‌కు సంబంధం ఉన్న సంగతి ఆయన భార్య సహా కుటుంబ సభ్యులందరికీ తెలుసని ఆమె చెప్పింది.
మణికందన్ కారణంగా తాను గర్భవతిని కూడా అయ్యానని.. ఐతే పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయితే సమాజం మరోలా చూస్తుందని చెప్పి తన మిత్రుడికి చెందిన ఆసుపత్రిలో అబార్షన్ చేయించారని ఆమె చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటి రిపోర్ట్‌ను కూడా చాందిని మీడియాకు చూపించింది. అలాగే మణికందన్ తనను కొట్టడం వల్ల గాయాలై చికిత్స తీసుకున్నప్పటి ఫొటోలు, రిపోర్టులను కూడా ఆమె బయటపెట్టింది. వీటితో పాటు మణికందన్ తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి.. తనకు న్యాయం చేయాలని మీడియాను కోరింది.
This post was last modified on May 29, 2021 7:45 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…