Movie News

హీరోయిన్ లకు నిచ్చెన.. చంద్రమోహన్..

నేను చిన్న వయసులో చూసిన సినిమా ‘ఓ సీత కథ’.. నాకు విపరీతంగా నచ్చింది.. అందులో హీరో చంద్రమోహన్.. తర్వాత చూసిన సినిమా ‘సిరిసిరిమువ్వ’.. అంతకంటే ఎక్కువ నచ్చింది.. వరసగా రెండుసార్లు చూసాను.. అద్భుతమైన డాన్సర్.. హావభావాలను పలికించటం లో ఏ నటుడికి నటీమణికీ తీసిపోని నటుడు.. తర్వాత చూసింది “బొమ్మా బొరుసా”.. దానిలో S వరలక్ష్మికి అల్లుడు.. చలం ఒక జట్కా బండివాడు.. వరలక్ష్మి కూతుర్ని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు.. ఆమె జమిందారీ కుటుంబం.. అత్తా అల్లుళ్లకు మధ్య ఒక రహస్య ఒప్పందంతో కూడిన ఛాలంజ్.. చలం చంద్రమోహన్.. ఇద్దరూ పోటీపోటీగా నటించారు.. అప్పట్లో ఎన్టీఆర్.. ఏఎన్ఆర్.. కృష్ణ.. శోభన్ బాబు.. కృష్ణంరాజు లాంటి హేమాహేమీలు ఉన్నాకూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో చంద్రమోహన్…అల్లూరి సీతారామరాజు సినిమాలో మంజులకు జోడి గా నటించాడు.. ఒక సీన్ లో సూపర్ స్టార్ కృష్ణ.. గుమ్మడి.. ప్రభాకరరెడ్డి లాంటి హేమాహేమీలు ఉన్నాకూడా తను ఏమాత్రం తగ్గకుండా తన పాత్రను రక్తి కట్టిస్తాడు…

అలాగే ‘జీవనతరంగాలు” సినిమాలో వాణిశ్రీ.. శోభన్ బాబు.. కృష్ణం రాజు ల మధ్య వారికి దీటుగా నిలబడతాడు.. విషాదం.. వినోదం.. కరుణ.. క్రౌర్యం.. ఏ రసాన్నయినా అద్భుతంగా పండించగల నటుడు…’ఇంటి గుట్టు’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ వున్న హీరో.. నాగభూషణం క్యారక్టర్ కు కొడుకు.. సినిమా ఎండ్ లో ఒక సీన్ లో కంటతడిపెట్టిస్తాడు..

ఏ పాత్ర చేసినా ఆ పాత్ర కనబడుతుంది కానీ చంద్రమోహన్ కనబడదు.. అదే ఆయన ప్రత్యేకత…చంద్రమోహన్ చేసినన్ని వైవిధ్యమైన క్యారెక్టర్లు ఏ ఇతర హీరోలు చేయలేదంటే అతిశయోక్తి కాదు.. ఎందుకంటే అతను కమర్షియల్ హీరో చట్రం లో ఇరుక్కోలేదు.. అందుచేతనే హీరో వేషాలు చేస్తూనే అల్లూరి సీతారామరాజు లో చేశారు.. ‘శంకరాభారణం’ లో ప్రధాన పాత్ర శంకరశాస్త్రి అయినా తనది హీరోలాంటి పాత్ర.. తను ఆ పాత్రను రక్తి కట్టించాడు..

ఈయనకు ఒక విచిత్రమైన సెంటిమెంట్ ని ఆపాదిస్తూ చెబుతుంటారు.. ఈయన ఇరిగేషన్ వెయిట్ లిఫ్టింగ్ ప్రాజెక్ట్ లాగా.. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ లాగా హీరోయిన్ లిఫ్టింగ్ ఛాంపియన్ అంటారు.. అదేమిటంటె ఈయనకు జోడిగా.. హీరోయిన్ గా చేసిన ప్రతి నాయిక తర్వాత పెద్ద స్థాయి హీరోయిన్ గా చలామణి అయ్యేవారు.. ‘పదహారేళ్ళ వయసు’లో శ్రీదేవి.. ‘సిరిసిరిమువ్వ’ లో జయప్రద…. జయసుధ.. విజయశాంతి.. ఇలా చాలా మంది మొదట ఈయనకి జోడీ గా చేసి పైకి వెళ్లినవారే.. మిగతా హీరోలందరితో పోలిస్తే ఈయన చాలా తక్కువ ఎత్తు.. కానీ తన నటనతో డాన్స్ లతో ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నారు..

ఒక దశలో పూర్తి హాస్యభరిత చిత్రాల కథానాయకుడిగా మారారు.. జంధ్యాల.. రేలంగి నరసింహారావు ల సినిమాలు ఎక్కువ చేసి మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నారు.. హీరోగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయ్యి చాలా అద్భుతమైన వేషాలు చేశారు…చాలా క్రమశిక్షణ తో కాల్ షీట్ టైం కంటే ముందే మేకప్ తో సెట్ లో ఉండేవాడు.. నేను చంద్రమోహన్ గారితో మూడు సినిమాలు చేశాను.. ‘వామ్మో వాత్తో ఓ పెళ్ళామో’..’హాండ్స్ అప్’..”రమణ “..సెట్ లో చాలా సరదాగా ఉండేవారు.. అటువంటి ఆర్టిస్టులు సెట్లో ఉంటే డైరక్టర్ కి కూడా సీన్ ని మెరుగులు దిద్దుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది…

ఆయనను మా అసిస్టెంట్ డైరక్టర్లు CM గారూ అని పిలిచేవారు.. Cm అంటే చంద్రమోహన్ కి షార్ట్ ఫార్మ్. మీతో తో పనిచేసిన క్షణాలు అన్నీ మధుర క్షణాలు అని నేను అంటే.. ఆయన మధురక్షణాలకు వేరే భాష్యం చెప్పేవారు.. షూటింగ్ జరుగుతుండగా 12. 45 నుండే అసిస్టెంట్ డైరక్టర్ ని పిలిచి ‘ఏవిటీ.. ఇవ్వాళ మధుర క్షణాలకు లేట్ అవుతుందా.. ఒకసారి డైరక్టర్ గారి చెవిలో ఒక మాట వెయ్యరాదు వంటిగంట దాటుతుందని… మధురక్షణాలు అంటే ఆయన ఉద్దేశ్యం లో లంచ్ బ్రేక్.. భోజనం చేయడాన్ని మధురక్షణాలు అని ముద్దుగా పిలిచుకునేవారు.. మంచి భోజనప్రియుడు.. షుష్టు గా అన్ని ఐటమ్స్ లాగించేవారు.. కానీ బాడీ లో ఏమాత్రం మార్పు వచ్చేది కాదు.. అది ఆయనకు ఒక వరం లాంటిది.. 23 మే చంద్రమోహన్ గారి 80 వ పుట్టినరోజు.. ఇంకో ఇరవై ఆరోగ్యంగా ఆనందంగా లాగించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు CM గారు…. Happy birthday chandramohan jee…

— శివ నాగేశ్వర రావు

This post was last modified on May 22, 2021 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

8 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

12 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

12 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

13 hours ago