Movie News

‘ఆర్ఆర్ఆర్’ డీల్.. ఫ్యాన్స్ అన్ హ్యాపీ


రూ.325 కోట్లకు ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. ఇండియాలో ఒక సినిమాకు ఓవరాల్‌గా ఇంత బిజినెస్ జరిగినా కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండగా.. కేవలం డిజిటల్ రైట్స్‌కే ఇంత రేటు పలకడం అంటే మామూలు విషయం కాదు. ‘జీ’ నెట్ వర్క్ అన్ని భాషలకూ కలిపి ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం ఈ వార్త కనిపిస్తోంది. ఈ సమాచారం వైరల్ అవుతున్న తీరు చూస్తుంటే డీల్ నిజమే అనిపిస్తోంది.

ఐతే ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ ‘జీ’ నెట్ వర్క్ సొంతం కావడం చాలామంది ప్రేక్షకులకు రుచించడం లేదు. సోషల్ మీడియాలో దీని పట్ల ఎక్కువమంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి పాపులర్ ఓటీటీల్లో ఏదో ఒకదానికి రైట్స్ ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఈ ఓటీటీలు అయితే తాము కొన్న సినిమాను సబ్‌స్క్రిప్షన్ ఉన్న ప్రేక్షకులకు ఉచితంగా చూపిస్తాయి. పైగా ఇండియాలో ఈ మూడు ఓటీటీలకే ఎక్కువగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఓటీటీలకు అలవాటు పడ్డ వారు మాండేటరీగా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే ఫ్లాట్ ఫామ్‌లు ఇవి. ‘జీ’ నెట్ వర్క్ విషయానికి వస్తే.. అది హిందీ ప్రేక్షకుల్లో మాత్రమే పాపులర్. సౌత్‌లో దానికంత ఆదరణ లేదు. పైగా అది కొత్త సినిమాలను ఎక్కువగా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తుంటుంది. ఆల్రెడీ థియేటర్లలో రిలీజైన చిత్రాలకు సైతం రేటు పెడుతుంటుంది. ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాలను ప్రీమియం కేటగిరీలో పెట్టి సబ్‌స్క్రిప్షన్‌కు ఎక్కువ ధర పెడుతుంది. ‘జీ’ వాళ్లకు ఇవ్వడం వల్ల థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాకు రీచ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐతే నిర్మాతలు తమకు అత్యధిక రేటు ఎవరిస్తారు అని చూస్తారు తప్ప.. ఏ ఓటీటీలో రిలీజ్ చేశారన్నది వారికి అప్రధానం. కాగా అమేజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు సైతం ‘ఆర్ఆర్ఆర్’ హక్కుల కోసం పోటీ పడ్డాయని.. అవి రూ.300 కోట్ల దాకా ఇవ్వడానికి ముందుకొచ్చాయని.. కానీ వాటిని మించి రూ.25 కోట్లు ఎక్కువ రేటు చెప్పడంతో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత వాళ్లకే హక్కులు ఇచ్చాడని అంటున్నారు.

This post was last modified on May 22, 2021 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

10 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago