రాజ్ నిడిమోరు-కృష్ణ డీకే.. షార్ట్‌గా చెప్పాలంటే రాజ్-డీకే.. బాలీవుడ్లో మంచి పేరున్న దర్శక ద్వయం. స్వీయ దర్శకత్వంలో ఫ్లేవర్స్, 99, షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ లాంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న ఈ దర్శకులు.. నిర్మాతలుగా ‘స్త్రీ’ లాంటి భారీ విజయాన్నందుకున్నారు. ఇక వీళ్లు తీసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. అమేజాన్ ప్రైమ్ కోసం చేసిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ మరో ఎత్తు.
ఇండియాలో బిగ్గెస్ట్ హిట్టయిన వెబ్ సిరీస్ ఇదే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఈ సిరీస్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రాజ్-డీకే ద్వయం సిద్ధమవుతోంది. ఐతే రాజ్-డీకే తెలుగు వాళ్లే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచే ఈ ఇద్దరూ వచ్చారు. ఐతే ఇద్దరూ ముంబయిలో కలిశారు. అక్కడే దర్శకులుగా అవకాశాలందుకున్నారు. మంచి స్థాయికి చేరుకున్నారు.
ఐతే తెలుగు వాళ్లయిన ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటిదాకా తెలుగులో సినిమా తీయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో తమ దర్శకత్వంలో వచ్చిన ‘షోర్ ఇన్ ద సిటీ’లో ఓ కీలక పాత్ర చేసిన సందీప్ కిషన్‌ను పెట్టి హీరో నానితో కలిసి ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేశారు. కానీ అది సరైన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పందన అందుకుంటున్న ‘సినిమా బండి’ లాంటి ఇండీ ఫిలింను ప్రొడ్యూస్ చేశారు.
మరి తెలుగులో దర్శకత్వం మాటేంటి అని రాజ్-డీకేలను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఇక్కడ సినిమా చేయాలనే ప్రయత్నం ఎప్పట్నుంచో చేస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతోనూ తాము టచ్‌లో ఉన్నామన్నారు. త్వరలోనే దర్శకులుగా తెలుగులో సినిమా తీస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
This post was last modified on May 16, 2021 2:26 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…