దేశంలో కొవిడ్ కల్లోలం రేపుతున్నప్పటికీ ఓ భారీ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. గురువారం సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. దేశంలో లాక్ డౌన్ షరతుల్లేని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ‘రాధె’ను థియేటర్లలో రిలీజ్ చేశారు. వాటి ద్వారా వచ్చిన వసూళ్లు నామమాత్రం. ఇక విదేశీ మార్కెట్లలో అవకాశం ఉన్న చోట భారీగానే సినిమాను రిలీజ్ చేశారు.
ఐతే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం ప్రతికూలం అయింది. తొలి రోజు ‘రాధె’ విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు అంచనా. విదేశాల్లోనూ కొవిడ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ వసూళ్లు మరీ తక్కువ కాదని.. పర్వాలేదని అంటున్నారు. ఇక ఇండియాలో ఈ సినిమా తొలి రోజు ఏ మేర కలెక్షన్లు రాబట్టిందన్నది ఆసక్తికరం.
జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ఈ మార్గంలో సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249.
42 లక్షల మంది తలో 249 రూపాయలు వెచ్చించారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి. ఐతే తొలి రోజు ఉన్న ఊపు రెండో రోజుకు కచ్చితంగా ఉండదు. పైగా సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. మరి రెండో రోజు వసూళ్ల సంగతేంటో చూడాలి. ఐతే రాధె టికెట్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయానికి తోడు జీ వాళ్లకు పెద్ద ప్రయోజనమే కలిగింది ‘రాధె’ ద్వారా. ఆల్రెడీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు తోడు కొత్తవాళ్లు ‘రాధె’ కోసం ‘జీ’ ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ 499కి అందించింది జీ. ఈ ఆఫర్ వాడుకున్న వాళ్లు లక్షల్లోనే ఉంటారు. కాబట్టి ఆ రకంగా కూడా ‘జీ’కు భారీగానే ఆదాయం సమకూరి ఉంటుంది.
This post was last modified on May 15, 2021 3:52 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…