Movie News

టీఎన్ఆర్‌లో జనాలకు తెలియని కోణం

కొందరు వ్యక్తుల మంచితనం వాళ్లు ఉన్నప్పటి కంటే వెళ్లిపోయాక జనాలకు బాగా అర్థమవుతుంటుంది. వాళ్లు లేని లోటును అందరూ ఫీలవుతారు. జర్నలిస్ట్ టర్న్డ్ యాక్టర్ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ ఇందుకు ఉదాహరణ. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూల ద్వారా పేరు తెచ్చుకుని, ఆ పేరుతో సినిమాల్లో నటుడిగానూ అవకాశాలు అందుకుని గత కొన్నేళ్లలో సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యారు టీఎన్ఆర్.

కొవిడ్‌ గురించి అందరిలోనూ అవగాహన పెంపొందించే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు ఆ మహమ్మారికే బలైపోయారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటికి రాగానే సామాజిక మాధ్యమాల్లో టీఎన్ఆర్ సన్నిహితులు, పరిచయస్తులతో పాటు వేలాదిగా నెటిజన్లు స్పందించిన తీరు ఆయనకున్న మంచి పేరును చాటిచెబుతుంది. టీఎన్ఆర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో అందరికీ కన్నీళ్లు తెప్పించింది.

టీఎన్ఆర్ మరణం నేపథ్యంలో ఆయన ప్రస్థానాన్ని అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు. తన ఇంటర్వ్యూలకు వచ్చిన అతిథులకు సాగిలపడకుండా, అలాగే కించపరచకుండా,ఎంతో హుందాగా టీఎన్ఆర్ చేసే ఇంటర్వ్యూల గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. నటుడిగా ఆయన చేసిన పాత్రల మాట్లాడుకుంటున్నారు. ఐతే టీఎన్ఆర్ పాపులర్ అయ్యాక ఇంటర్వ్యూయర్, నటుడిగా అందరి దృష్టిలో పడ్డారు. కానీ ఆయనలో జనాలు చూడని కోణాలు కొన్ని ఉన్నాయి. నిజానికి దర్శకుడవ్వాలన్న కోరికతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ దగ్గర ఆయన ముందుగా అసిస్టెంటుగా చేరారు.

‘హిట్లర్’తో పాటు పలు చిత్రాల రచనలోనూ టీఎన్ఆర్ పాలు పంచుకున్న సంగతి చాలామందికి తెలియదు. ‘పిట్టలదొర’ సినిమాకు ఆయన సహాయ దర్శకుడిగా పని చేయడం విశేషం. తర్వాత బుల్లితెరపై దృష్టిపెట్టారు. పలు ఛానెళ్లలో పలు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. ఈటీవీలో బాగా పాపులర్ అయిన ‘నేరాలు ఘోరాలు’ క్రైమ్ ప్రోగ్రాంకు నాలుగేళ్ల పాటు టీఎన్ఆర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆపై యూట్యూబ్ ఛానెళ్ల హవా మొదలయ్యాక ఐడ్రీమ్‌కు ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. వినూత్న శైలితో సుదీర్ఘ ఇంటర్వ్యూలు చేయడంతో ఆయన పాపులర్ అయ్యారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే.

This post was last modified on May 11, 2021 7:27 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

8 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

28 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago