సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లకు హ్యాకింగ్ బెడద ఎప్పుడూ పొంచే ఉంటుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లతో పాటు యూట్యూబ్ ఛానెళ్లను సైతం హ్యాక్ చేసి సెలబ్రెటీలను బెదిరించే హ్యాకర్లు చాలామందే తయారయ్యారు. తాజాగా మంచు లక్ష్మీప్రసన్న యూట్యూబ్ ఛానెల్‌ను ఎవరో హ్యాక్ చేశారు. ఆమె ‘చిట్టి చిలకమ్మ’ పేరుతో కొంత కాలం కిందట యూట్యూబ్ ఛానెల్ పెట్టడం.. అందులో పిల్లలకు ఆసక్తికర పాఠాలు బోధిస్తుండటం తెలిసిన సంగతే.
ఐతే ఇప్పుడా యూట్యూబ్ ఛానెల్‌ను ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా లక్ష్మి వెల్లడించింది. తన ఛానెల్ నుంచి ఏదైనా అర్థరహితమైన కంటెంట్ వస్తే దాన్ని పట్టించుకోవద్దని లక్ష్మి తన ఫాలోవర్లకు సూచించింది. ఛానెల్‌ను పునరుద్ధరించేందుకు తన టీం ప్రయత్నిస్తోందని.. త్వరలోనే ఛానెల్ తిరిగి తన చేతికి వస్తుందని లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేసింది.
చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానెల్లో తన కూతురు విద్యా నిర్వాణ మీద తీసిన వీడియోలను పోస్ట్ చేస్తూ లక్ష్మి జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల పెంపకం, వారికి చదువు చెప్పించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులను చక్కగా ఆమె వివరిస్తూ వస్తోంది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. లక్ష్మికి దీని ద్వారా మంచి ప్రశంసలు దక్కాయి. త్వరలోనే ఈ ఛానెల్ లక్ష్మి చేతికి వస్తుందేమో చూడాలి.
ఇక మంచు లక్ష్మి కెరీర్ విషయానికి వస్తే ఆమె సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నట్లే ఉంది. చివరగా ఆమె ‘వైఫ్ ఆఫ్ రామ్’తో పలకరించింది. అది మంచి ప్రయత్నమే అయినా సరైన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఇటీవల నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ‘పిట్టకథలు’ వెబ్ ఫిలింలో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ‘రాములా’ ఎపిసోడ్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ వెబ్ ఫిలింలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది ‘రాములా’ సెగ్మెంటే.
This post was last modified on May 11, 2021 7:32 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…