తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్.. కరోనాకు తలొంచిన మరో మీడియా కమ్ సినీ ప్రముఖుడు. దర్శకుడవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎల్బీ శ్రీరాం దగ్గర కొన్నాళ్లు రచయితగా పని చేసి.. ఆ తర్వాత మీడియాలోకి వెళ్లి.. యూట్యూబ్‌లో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ కావడమే కాక నటుడిగా అవకాశాలు అందుకుని.. బిజీ అయిన వ్యక్తి టీఎన్ఆర్.
కరోనా గురించి, దాని బాధితుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎంతోమందిని జాగృతం చేసిన టీఎన్ఆర్ చివరికి ఆ కరోనాకే బలైపోయారు. నెల కిందట తనకు అమ్మ లాంటి ఓ వ్యక్తి కరోనా బారిన పడి ప్రాణాల కోసం పోరాడుతోందని, ఆమె కోసం ప్రార్థించాలని ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టారాయన. ప్రముఖులనే కాక.. మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కని వారిని ఇంటర్వ్యూలు చేయడం, పోస్టులు పెట్టడం ద్వారా చిన్న సినిమాలకు ఎంతగానో ప్రోత్సాహం అందించిన మంచి వ్యక్తి టీఎన్ఆర్.
కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడి ఇంటి దగ్గరే మందులేసుకుంటూ ఉల్లాసంగానే కనిపించారు టీఎన్ఆర్. తన పరిస్థితి విషమించి ఆసుపత్రి పాలవడానికి ముందు ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో మంచి సూచనలు చేశారు. తాను కరోనా బారిన పడ్డప్పటికీ.. చాలా ఆరోగ్యంగానే ఉన్నానని, ఏ ఇబ్బందీ లేదని.. మంచి పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ ఉల్లాసంగా గడుపుతున్నానని చెప్పారు. చెడులోనూ మంచిని వెతుక్కోమని పెద్దలు అంటుంటారని.. తాను కూడా ఈ ఖాళీ సమయంలో ప్రాణాయామం, యోగా చేయగలుగుతున్నానని అన్నారు.
కరోనా బారిన పడ్డ వారు ఎక్కువ టెన్షన్ పడకుండా, టీవీల్లో నెగెటివ్ న్యూస్ చూడకుండా ప్రశాంతంగా ఉండాలని.. అలా చేస్తే కరోనా ఎవరినీ ఏమీ చేయదని, సులువుగానే కోలుకుంటారని ఆయన హితవు పలికారు. అలాగే పిల్లలకు మంచి మాటలు చెప్పి, వాళ్లంతట వాళ్లు కొత్త విషయాలు తెలుసుకునేలా శిక్షణ ఇవ్వాలని పెద్దలకు సూచించారు. నాలుగు రోజుల కిందట ఇలా వీడియోలో మంచి మాటలు చెప్పి ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి ఇలా ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం.
This post was last modified on May 10, 2021 4:04 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించిన పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కడా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార…
+ ``పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!`` + ``మీ సెలవులు రద్దు చేస్తున్నాం.…
ఇండియా క్రేజీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది. ఆగస్ట్ 14…
దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’…
అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ…
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా…