స్టార్ హీరోల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ద్విపాత్రాభినయం చేయడం మామూలే. నిన్నటితరం బడా స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఒకటికి మించే ఉన్నాయి. ఐతే తర్వాతి తరం హీరోలు మాత్రం ద్విపాత్రాభినయాలు చేయడంలో కొంచెం వెనుకబడే ఉన్నారు.
ఐతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ‘బాహుబలి’లో రెండు పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ ఆ రెండు పాత్రలు ఒకే సమయంలో కనిపించవు. వేర్వేరు కాలాల్లో ఉంటాయి. ఐతే త్వరలో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ప్రభాస్‌లను చూడబోతున్నట్లుగా ఇప్పుడో ఆసక్తికర రూమర్ హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో అతను డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడట. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరొకటి కొడుకు పాత్ర అంటున్నారు.
సినిమాలో లీడ్ రోల్ కొడుకు పాత్రదే. సినిమా అంతా ఆ పాత్ర కనిపిస్తుందట. ఐతే తండ్రి పాత్ర కాసేపు ఉంటుందని.. దాని కోసం ప్రభాస్ భిన్నమైన మేకప్‌లో కనిపించనున్నాడని అంటున్నాడు. కెరీర్లో తొలిసారిగా ఇందుకోసం వృద్ధుడిగా మేకప్ వేసుకోనున్నాడట యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ వృద్ధుడిగా కనిపించబోతున్నాడంటే ఆ అవతారం ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కలగడం ఖాయం. ఈ సినిమా కోసమే ప్రభాస్ కోర మీసంతో కొత్తగా కనిపిస్తుండటం తెలిసిందే.
సలార్‌గా ప్రభాస్ ఫస్ట్ లుక్ చాలా ఎగ్జైటింగ్‌గానే అనిపించింది. ఇక అందులో వయసు మళ్లిన పాత్ర లుక్ ఎలా ఉంటుందో చూడాలి. రెండు షెడ్యూళ్ల షూటింగ్ జరిపాక ఈ సినిమా నుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకున్నాడు. దీంతో సమాంతరంగా అతను ‘ఆదిపురుష్’ కూడా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రం షూటింగ్ ఇలా మొదలైందో లేదో అలా ఆగిపోయింది. దీనికి కారణం కరోనానే. కొంత విరామం తర్వాత ప్రభాస్ మళ్లీ ఈ రెండు చిత్రాల షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.
This post was last modified on May 10, 2021 9:30 am
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…