Movie News

బంగారం లాంటి సీజన్.. మళ్లీ వేస్టే

టాలీవుడ్‌కు సంబంధించి సినిమాలకు ది బెస్ట్ సీజన్ అంటే వేసవే. సంక్రాంతి, దసరా లాంటి సీజన్లు కూడా బాగానే కలిసొస్తాయి కానీ.. అప్పుడు సెలవులుండేది వారం పది రోజులే. అవి షార్ట్ సీజన్స్. కానీ వేసవి అలా కాదు. మార్చి నెలాఖర్లో మొదలుపెడితే.. జూన్ మధ్య వరకు రెండు మూడు నెలల పాటు సినిమాలకు బ్రహ్మాండంగా కలిసొస్తుంటుంది. విద్యార్థులందరికీ దశల వారీగా సెలవులుంటాయి. వాళ్లు థియేటర్ల మీద దండయాత్ర చేస్తుంటారు. మిగతా ప్రేక్షకులు సినిమాలు చూడటానికి బాగా ఉత్సాహం చూపిస్తుంటారు వేసవిలో. అందుకే ప్రతి ఏడాదీ వేసవికి భారీ చిత్రాలు వరుస కడుతుంటాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి.

ఐతే ఎప్పుడూ కొత్త సినిమాలతో కళకళలాడే వేసవి సీజన్.. గత ఏడాది కరోనా కారణంగా వెలవెలబోయింది. థియేటర్లు పూర్తిగా మూతబడిపోవడంతో బంగారం లాంటి సీజన్ వృథా అయిపోయింది. ముందు థియేటర్లకు గ్రహణం కొన్ని రోజులకే అనుకున్నారు. కానీ నెలలకు నెలలు అది కొనసాగింది. వేసవి మొత్తం ఎదురు చూపులే సరిపోయాయి. థియేటర్లు తెరుచుకోనే లేదు. గత ఏడాది చివరికి కానీ మళ్లీ థియేటర్లలో కళ రాలేదు. ఐతే థియేటర్ల పున:ప్రారంభం తర్వాత మళ్లీ త్వరగానే సందడి కనిపించడంతో అయ్యిందేదో అయ్యిందని.. గత ఏడాది నష్టపోయిందంతా ఈసారి వేసవిలో భర్తీ చేసుకుందామని సినీ పరిశ్రమ భారీ ప్రణాళికలతో సిద్ధమైంది. ఎన్నో క్రేజీ సినిమాలు వేసవి బరిలో నిలిచాయి.

కానీ కరోనా సెకండ్ వేవ్ ఈ వేసవిని కూడా దెబ్బ కొట్టింది. గత నెలలో కరోనా ఉద్ధృతి పెరగడంతో వరుసగా సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో పరిస్థితులు బాగు పడతాయని అనుకుంటే.. ఈ నెలలో పరిస్థితులు మరింత దుర్భరంగా తయారయ్యాయి. థియేటర్లలో సినిమాల గురించి అసలు ఆలోచించే పరిస్థితే కనిపించడం లేదు. మే మీద ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. జూన్ నెలలో కూడా పరిస్థితులు మెరుగవుతాయా.. కొత్త సినిమాలు రిలీజవుతాయా అన్నది సందేహంగానే ఉంది. మొత్తంగా చూస్తే మరోసారి వేసవి పూర్తిగా వేస్ట్ అయ్యేట్లే కనిపిస్తోంది. జులైకైనా థియేటర్లు మునుపటిలా నడిచి కొత్త సినిమాలు నడిస్తే గొప్ప అన్నట్లే ఉంది.

This post was last modified on May 9, 2021 9:24 am

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

59 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

3 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

4 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

4 hours ago