సమంత ఫ్రెండ్ కోసం చైతన్య బుక్కయ్యాడు!

సమంతకి ఇండస్ట్రీలో ఉన్న మంచి ఫ్రెండ్స్ లో నందిని రెడ్డి ఒకరు. ఓ బేబీ సినిమాతో సమంతకి మరపురాని సినిమాని అందించడంతో నందినితో ఆమెకి ఉన్న అనుబంధం మరింత బలపడింది.

నందిని రెడ్డి మంచి సినిమాలే తీసినా కానీ ఆమెతో పని చేయడానికి కాస్త బిజీగా ఉండే హీరోలు ఆసక్తి చూపించారు. అందుకే నాగ శౌర్య లాంటి వాళ్ళతో ఆమె పని చేయక తప్పట్లేదు.

ఇదిలా వుంటే నందిని రెడ్డి ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పుడున్న బిజీలో చైతన్య డేట్స్ దొరకడం దాదాపు అసాధ్యం. కానీ భార్య కోరితే చైతన్య ఎలా కాదనగలడు.

అలా నందిని రెడ్డితో తనకున్న అనుబంధానికి సమంత ఇలా తన భర్తని ఒప్పించి ఆమెతో సినిమా చేయించడం ద్వారా బదులు తీర్చుకుంటోంది. మరి ఈ చిత్రంలో కథానాయికగా సమంత నటిస్తుందో లేదో వేచి చూడాలి.