పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం ‘పింక్’ రీమేక్‌ను ఎంచుకుంటున్నాడన్న వార్త అప్పట్లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో పవన్ నటించడమేంటన్నది వారి అభ్యంతరం. అదే నిరాశ కలిగించే విషయం అంటే.. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు అనగానే ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది అభిమానుల్లో. ఈ దర్శకుడి తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ పెద్ద డిజాస్టర్. రెండో సినిమా ‘ఎంసీఏ’ హిట్టయినా అందులో పెద్దగా దర్శకుడి ప్రతిభ కనిపించలేదు. అసలే రీమేక్.. పైగా వేణు దర్శకత్వమా అంటూ ఎద్దేవా చేశారు అభిమానులు. స్వయంగా పవన్ ఫ్యాన్సే వేణును ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. గూగుల్లో వెతికినా ఇతడి గురించి సమాచారం ఉండదు అంటూ ఎద్దేవా చేశారు అప్పట్లో. ఎక్కడ దొరుకుతారు నీకిలాంటి డైరెక్టర్లు అంటూ పవన్‌ను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
అలాంటిది గత కొన్ని రోజులుగా వేణు పట్ల పవన్ ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం అంతా ఇంతా కాదు.‘వకీల్ సాబ్’ ప్రోమోలు మొదలైనప్పటి నుంచి వేణు మీద అభిప్రాయం మారుతూ వచ్చింది. ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టును పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి సినిమాలో హీరోయిజానికి, మాస్ అంశాలకు లోటు లేకుండా చూడటం పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే వేణు పట్ల వారికి ఆరాధన భావం వచ్చింది.
రిలీజ్ తర్వాత అయితే చెప్పాల్సిన పని లేదు. మంగళవారం వేణు పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద పవన్ అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటికే వేణుకు ‘మాస్ గాడ్’ అని బిరుదు ఇచ్చేయడం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా #HBDMASSGODVENUSRIRAM అని హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్లో. వేణుకు ఎలివేషన్లు ఇస్తూ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో దర్శకుడి ప్రతిభను చాటే సన్నివేశాలతో ట్వీట్లు గుప్పిస్తున్నారు. హరీష్ శంకర్ తర్వాత ఒక అభిమాని తన ఆరాధ్య కథానాయకుడితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో వేణు చూపించాడంటూ అతణ్ని కొనియాడుతున్నారు.
This post was last modified on May 5, 2021 8:19 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…