గత నెలలో థియేటర్లను కళకళలాడించిన సినిమా ‘వకీల్ సాబ్’. గత ఏడాది కాలంలో అలాంటి సందడిని ఎప్పుడూ చూడలేదు తెలుగు ప్రేక్షకులు. కరోనా ధాటికి ఏడాదికి పైగా పెద్ద సినిమాల సందడి లేక అందరూ ఒక నైరాశ్యంలో ఉండగా.. ఈ సినిమా వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. కానీ ఈ సినిమాతోనే థియేటర్ల వైభవానికి తెరపడటం విచారకరం. కరోనా సెకండ్ వేవ్ ధాటికి థియేటర్లను మూత వేయక తప్పలేదు. కరోనా లేకుంటే ‘వకీల్ సాబ్’ థియేటర్లలో ఇంకా కొన్ని రోజులు బాగా ఆడేదేమో.
ఐతే ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ రన్‌కు త్వరగా తెరపడ్డప్పటికీ.. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ బాట పట్టడంతో ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమాలన్నీ ‘వకీల్ సాబ్’ ముచ్చట్లతో నిండిపోతున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వాళ్లతో పాటు ఆల్రెడీ థియేటర్లలో చూసిన వాళ్లు కూడా విరగబడి ‘అమేజాన్ ప్రైమ్’లో ఈ సినిమాను చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మామూలుగా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న సినిమాలకు రిపీట్ ఆడియన్స్ వస్తుంటారు. ‘వకీల్ సాబ్’ను కూడా తొలి రెండు వారాల్లో అలా అభిమానులు మళ్లీ మళ్లీ చూశారు. ఐతే ఈ సినిమాకు సెకండ్ వీకెండ్ అయ్యేసరికే కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఐతే ఇప్పుడు అమేజాన్ ప్రైమ్‌లో ఫ్యాన్స్ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను బాగా ఆస్వాదిస్తున్నారు.
సూపర్ ఉమన్ సీన్‌తో పాటు విజిల్ వర్తీ అనిపించే కొన్ని సన్నివేశాలను మళ్లీ మళ్లీ చూసి సోషల్ మీడియాలో ముచ్చట్లు పెడుతున్నారు. సినిమా రిలీజైనపుడు ఎలా అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్‌ను ఆకాశానికెత్తేశారో.. ఇప్పుడు అదే స్థాయిలో అతణ్ని కొనియాడుతున్నారు. ఫలానా సీన్లో బీజీఎం అంటూ.. ఇబ్బడిముబ్బడిగా ట్వీట్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ ‘వకీల్ సాబ్’కు పట్టం కడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రైమ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా ‘వకీల్ సాబ్’ రికార్డుల్లోకి ఎక్కే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on May 2, 2021 2:30 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…