‘పుష్ప’ ని లాస్ట్ మినిట్ దాకా అందుకే లాగారు

కరోనా భయంతో అందరూ షూటింగ్ లు ఆపుచేసుకుని కూర్చుంటున్నారు. కానీ పుష్ప టీమ్ కంటిన్యూ చేసేసింది. చివరకు అల్లు అర్జున్ కు కూడా పాజిటివ్ వచ్చినా షూటింగ్ అపలేదు. అదే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సోషల్ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. టీమ్ లో ఉన్నవాళ్లకు, మిగతా ఆర్టిస్ట్ లుకు ఏమైనా అయితే ఏంటి పరిస్దితి అంటూ చాలా మంది ఏకిపారేసారు. అయితే పుష్ప దర్సకుడు సుకుమార్ కు ఇవన్ని తెలియనవి కాదు. ఎందుకలా చేసారు అంటే అసలు విషయం బయిటకు వచ్చింది.

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. అతని డేట్స్ చాలా కష్టంగా ఉన్నాయి. ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. ఒక్కసారి షూటింగ్ కాన్సిల్ అయ్యితే డేట్స్ మళ్లీ దొరకవు. దాంతో ఫహద్ డేట్స్ ఉన్నమేరకు షూటింగ్ చేసేయాలని చేసేసారు. అయితే సిటీలో రోజు రోజుకీ కేసులు పెరిగిపోయిన నేపధ్యంలో ఫహాద్ నేను చేయలేనని వెళ్లిపోయారు. దాంతో షూట్ ఆగిపోయింది. కానీ కరోనా సెకండ్ వేవ్ తగ్గాక మళ్లీ డేట్స్ దొరకటం ఎంత కష్టం అని టీమ్ అంటున్నారు. అయితే ఆయనంతట ఆయనే వెళ్లిపోయారు కాబట్టి డేట్స్ ఎలోగోలా ఎడ్జెస్ట్ చేస్తారనే ఆశపడుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో చేర్చాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకూ షూటింగు కానిచ్చారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)